duplicate whatsapp apps in play store కుడి ఎడమ దగా, దగా.. ప్లే స్టోర్ కు చేరిందా..!

Duplicate whatsapp apps in play store

whatsapp app, whatsapp duplicate app, whatsapp business app, whatsapp updater, google official symbol, downloads number, malware, smart phone

be carefull while updating whatsapp app through google play store as their are many duplicate apps resembling official whatsapp app

కుడి ఎడమ దగా, దగా.. ప్లే స్టోర్ కు చేరిందా..!

Posted: 11/03/2017 05:23 PM IST
Duplicate whatsapp apps in play store

గూగుల్ ప్లే స్టార్ పేరు వినగానే ఇందులో లభించే యాప్ లు అన్ని భద్రతా ప్రమాణాలతోనే కూడుకున్నవి భావిస్తే.. పోరబాటే అవుతుందండోయ్. ఎందుకంటే ఇప్పటికే కొట్లాది మంది ప్రజాధారణ చూరగొన్న యాప్ లకు నకిలీలు అత్యంత తెలివిగా ప్లేస్టోర్ లో వచ్చి చేరుతున్నాయి. ప్రముఖ యాప్ లకు చిన్న చిన్న సవరణలో ఈ యాప్ లు రావడంతో అవి కూడా వాటికి సంబంధించినవే అనుకుంటే పొరబాటే. ఇలాంటి నకిలీ యావ్ ల వల్ల మాల్ వేర్ వచ్చి చేరే ప్రమాదం కూడా వుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తాజాగా రోజుకో ఫీచర్ ను ప్ర‌వేశ‌పెడుతూ వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షిస్తున్న వాట్సాప్ యాప్ ను కూడా నకిలీల బెడద వెంటాడుతుంది. వాట్సాప్ పేరుతో ఉన్న కొన్ని న‌కిలీ యాప్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో ద‌ర్శ‌నమివ్వడంతో స్మార్ట్ ఫోన్ ప్రియుల నుంచి అందోళన వ్యక్తమవుతుంది. కొత్త ఫీచ‌ర్ల‌ను వినియోగించుకోవ‌డానికి వాట్సాప్ ను అప్ డేట్ చేయాల్సి వ‌స్తుంది. ఇందుకోసం ప్లే స్టోర్ కి వెళ్లిన‌ వారికి 'అప్ డేట్ వాట్సాప్ మెసేంజ‌ర్' అనే యాప్ దర్శనమివ్వడంతో ఖాతాదారులు ఖంగుతింటున్నారు.

అలాగే త్వ‌ర‌లో వాట్సాప్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్న వాట్సాప్ బిజినెస్‌ సౌక‌ర్యానికి సంబంధించి కూడా ఒక న‌కిలీ యాప్ ప్లేస్టోర్‌లో ఉంది. 'వాట్సాప్ బిజినెస్' పేరుతో ఉన్న ఈ యాప్ కూడా న‌కిలీది. ఎందుకంటే బిజినెస్ స‌ర్వీసుల‌ను భార‌త‌దేశంలో వాట్సాప్ ఇంకా పూర్తిస్థాయిలో ప్ర‌వేశ‌పెట్ట‌లేదు. ఈ న‌కిలీ యాప్ ల‌ను డౌన్ లోడ్ చేసుకుంటే స్మార్ట్ ఫోన్ ప్ర‌మాదంలో పడే అవకాశముందని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. యాప్ ల‌ను డౌన్ లోడ్ చేసుకునే ముందు కంపెనీ పేరును, ట్ర‌స్టెడ్ వివ‌రాల‌ను, డౌన్ లోడ్‌ల సంఖ్య‌ను గ‌మనించాల‌ని సూచన.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles