Revanth slams TRS govt కుటుంబ సౌఖ్యానికే పెద్దపీట.. ఇందుకేనా తెలంగాణ.?

Kcr not fulfilled atleast one election promise during ruling

Revanth Reddy, Kodandaram, TTDP leaders, chandrababu, AP Intelligence, Joel Davis, jal vihar, hyderbad police, Rahul gandhi, prof. kodandaram, Congress Andhra bhavan, Telangana bhavan, TRS goverenment, KCR, andhra pradesh, politics

Former TDP Telangana working president, A Revanth Reddy, who will be joining Congress critised TRS government in not fulfilling atleast one election promise during 3 and half years ruling.

కుటుంబ సౌఖ్యానికే కేసీఆర్ పెద్దపీట.. ఇందుకేనా తెలంగాణ.?

Posted: 10/30/2017 03:38 PM IST
Kcr not fulfilled atleast one election promise during ruling

తెలంగాణ ప్రజల అకాంక్షను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీయేనని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన తన అనుచర కార్యవర్గంతో కలసి హస్తినకు బయలేదేరి వెళ్లనున్న నేపథ్యంలో నిర్వహించిన అత్మీయ సమ్మెళనం కార్యక్రమానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పురుషోత్తమ్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రసంగిస్తూ..నవ్యాంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని నష్టపర్చుకుని మరీ అమె తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రాన్ని ప్రకటించారని అన్నారు.

నిజంగా సోనియాగాంధీ ఇక్కడ ప్రజల కష్టాలను, నష్టాలను, ఓదార్పును, సహనాన్ని తెలుసుకున్నారని.. తెలంగాణ యువత రాష్ట్రం రాలేదన్న వ్యధతో అత్మబలిదానాలు చేసుకున్న విషయాలతో చలించిపోయి.. రాష్ట్రాన్ని ప్రకటించారన్నారు. రాష్ట్రం సాకారమైన తరువాత తెలంగాణ కేవలం తానే తీసుకువచ్చానని చెప్పుకుంటున్న కేసీఆర్.. సోనియాగాంధీ వద్దకు ఎందుకు వెళ్లి కలిశారని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రవాంఛ ఎందుకు ఉద్భవించిందో మర్చిన కేసీఆర్.. ప్రజలకు మాటలతో మభ్యపెడుతున్నారని విమర్శించారు.

తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు బగ్రెలు, గొర్రెలు ఇచ్చి శాంతపరుస్తున్న కేసీఆర్.. అందుకోసమే తెలంగాణ వచ్చిందా..? అందుకోసమే సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చిందా అన్ని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో ఎప్పుడైనా అమరవీరుల కుటుంబాలతో కలసి పది నిమిషాలు మాట్లాడావా అని నిలదీశారు. గత 14 ఏళ్లుగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క మాటను నిలబెట్టుకోలేదన్నారు. ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా కేసీఆర్ నేరవేర్చలేదని రేవంత్ దుయ్యబట్టారు. నిరుద్యోగుల అర్తిని తీర్చడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని, అయితే తన కుటుంబ సౌఖ్యాని, సంతోషానికి మాత్రం ఎలాంటి విఘాతం కలగకుండా జాగ్రత్తపడుతున్నారని రేవంత్ విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles