Fake stamp paper scam convict Abdul Karim Telgi dies అబ్దుల్ కరీం తెల్గీ కన్నుమూత

Abdul karim telgi convict in fake stamp paper scam dies in bengaluru

Abdul Karim Telgi, fake stamp paper scam, Abdul Karim Telgi dead, Victoria Hospital Bengaluru, multiple organ failure

Fake stamp paper scam convict Abdul Karim Telgi died around 3.55pm at the Victoria Hospital in Bengaluru due to multiple organ failure

నకిలీ స్టాంపుల సూత్రధారి కరీం తెల్గీ కన్నుమూత

Posted: 10/26/2017 06:33 PM IST
Abdul karim telgi convict in fake stamp paper scam dies in bengaluru

నకిలీ స్టాంపుల కుంభకోణం కేసులో ముఫై ఏళ్ల కఠిన కారాగార శిక్షను ఎదుర్కొంటున్న ప్రధాన సూత్రధారి అబ్దుల్‌ కరీం తెల్గీ ఇవాళ తీవ్ర అనారోగ్యంతో అసుపత్రిలో కన్నుమూశాడు. గత కొంత కాలంగా వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో తెల్గీ బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే అతన్ని బెంగళూర్‌ లోని విక్టోరియా ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స అందజేస్తున్నారు. అతన్ని సకాలంలో అస్పత్రిలో చేర్పించడంలో బెంగుళూరు పరప్పనా అగ్రహారం జైలు అధికారులు నిర్లక్ష్యం వహించారని.. అతని పరిస్థితి విషమంగా వుందని, ముందుగానే తీసుకువచ్చుంటే పరిస్థితి అదుపులో వుండేదని వైద్యులు చెప్పినట్లు తెల్గీ తరపు న్యాయవాది ఇటీవలే అరోపించారు.


వేల కోట్లకు సంబంధించిన నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణంలో నిందితుడిగా ఉన్న తెల్గీని అజ్మీర్ లో నవంబర్ 2001లో తెల్గీని అరెస్ట్ చేశారు. దోషిగా తేలటంతో కోర్టు 30 సంవత్సరాల కఠిన శిక్ష విధించగా.. అప్పటి నుంచి బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఆయన్ను ఉంచారు. అంతేకాదు రూ. 202 కోట్ల జరిమానాను విధించింది కూడా. ఆ మధ్య ఈయనకు జైల్లోనే చికిత్స అందించారంటూ జైళ్ల మాజీ డీఐజీ రూప ఆరోణలు చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles