Man sets wife, children ablaze at Tirunelveli Collectorate అప్పిచ్చిన వారి వేధింపులు భరించలేక..

Tamil nadu man sets wife daughters ablaze after being harassed by money lender

Tamil Nadu, Self immolation, Tirunelveli, collector office, sp office, local police, Isakimuthu, Subbulakshmi, Loan sharks, crime

A labourer set his wife and two children ablaze besides attempting to commit suicide in a similar fashion on the Collectorate premises here on Monday even as the weekly grievance redressal meet was going on.

ఘోరం: అప్పిచ్చిన వారి వేధింపులు భరించలేక..

Posted: 10/23/2017 03:53 PM IST
Tamil nadu man sets wife daughters ablaze after being harassed by money lender

తమిళనాడులోని హోరం జరిగింది. అప్పును తీసుకున్న పాపానికి ఆ కుటుంబంలోని చిన్నారులతో పాటు అందరూ అగ్నికి అహుతికావాల్సి వచ్చింది. తీసుకన్న రుణం వడ్డీతో సహా కలిపి తిరిగి చెల్లించినా.. ఇంకా వడ్డీ కిందే ఇచ్చిన మొత్తం పోయిందని, అసలు అలాగే వుందని అప్పు తీసుకన్న కుటుంబాన్ని జలగల్లా వేధిస్తుండటంతో.. కలెక్టరేట్ కు చేరుకున్న బాధితుడి కుటుంబం.. అక్కడ కూడా తనకు సరైన విధంగా న్యాయం జరగడం లేదని అవేదనతో తన భార్య, కూతుళ్లుపై కిరోసిన్ పోసి నిప్పించించి.. తాను నిప్పంటించుకున్నాడు.

ఈ హృదయవిదారక ఘటన తమిళనాడులోని తిరునెల్వేలి కలెక్టర్ ఆఫీసు వ‌ద్ద చోటు చేసుకుంది. త‌మ స‌మ‌స్య గురించి కలెక్టర్‌కు ఎన్నిసార్లు చెప్పుకున్నా వినిపించుకోక‌ుండా వారు జిల్లా ఎస్పీ కార్యాలయానికి పంపుతున్నారని, దీంతో ఎస్పీ కార్యాలయంలో వారు సంబంధిత పోలిస్ స్టేషన్ కు పంపుతున్నారని, అక్కడి పోలీసులు అప్పులిచ్చే వారితో చేతులు కలపడంతో తమకు న్యాయం జరగడం లేదని అంగలార్చిన ఓ కుటుంబం విపరీతమైన నిర్ణయానికి వచ్చి అత్మహత్యయత్నానికి పాల్పడింది.

బాధిత కుటుంబంలోని భార్య సుబ్బులక్ష్మీ సోదరుడు మీడియాతో మాట్లాడుతూ తమ సోదరి కుటుంబానికి డబ్బు అవసరమై ఎనమితి నెలల క్రితం లక్షన్నర రూపాయలను ముత్తులక్ష్మి అనే వ్యక్తి నుంచి అప్పు తీసుకుందని, అయితే వారికి వడ్డీతో సహా డబ్బును సుమారు రూ, 2.35 వేలను చెల్లించినా ఇంకా తమకు డబ్బురావాలని ప్రతినిత్యం పీడిస్తున్నారని, దీంతో స్థానిక పోలిస్ స్టేషన్ వెళ్లినా తమకు న్యాయం జరగలేదని అన్నాడు.

దీంతో.. వారు కలెక్టర్ కార్యాలయాని వచ్చినా ఎప్పటి మాదిరిగానే ఎస్సీ కార్యాలయానికి పంపడంతో.. విసిగిపోయిన అత్మహత్యయత్నానికి పాల్పడ్డారని చెప్పాడు.   స్థానికులు, పోలీసులు కాపాడారు. వెంటనే మంటలను ఆర్పేసి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే, ఆ కుటుంబ స‌భ్యుల‌ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఆత్మహ‌త్యాయ‌త్నం చేసిన వారు ఇసక్కిముత్తు, ఆయన భార్య సుబ్బలక్ష్మి, వారి కూతుళ్లు మదు శరణ్య, అక్షయ పూర్ణిమగా పోలీసులు గుర్తించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles