gambling at marriott, taskforces raids hotel మారియట్ లో మకాం వేసి.. ప్రముఖుల పాడు పని..

Gambling at marriott taskforces raids hotel 40 businessmen held

celebs gambling at marriott hotel, celebs Playing Cards at mattiott hotel, Marriott Hotel, diwali, businessmen Playing Cards at mattiott hotel, celebrities Playing Cards at mattiott hotel, Playing Cards, Marriott Hotel, diwali, businessmen, celebrities, task force police, hyderabad police, Telangana, crime

task force police raid marriott hotel secundrabad and took nearly 40 celebrities and renowned businessmen into custody as they all are playing cards in the hotel.

మారియట్ లో మకాం వేసి.. ప్రముఖుల పాడు పని..

Posted: 10/20/2017 09:56 AM IST
Gambling at marriott taskforces raids hotel 40 businessmen held

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరూ.. లక్ష్మీ పూజ చేసుకుని.. ఇంట్లోని వారందిరితో కలసి స్వీట్లు పంచుకుని టపాసులు పేలుస్తుంటే.. నగరంలోని ప్రముఖుల మాత్రం తమ కార్యకలాపాలను పక్కనబెట్టి భారీస్థాయిలో జూదానికి తెరతీశారు. వినడానికి విచిత్రంగా వున్నా.. ఇది పూర్తిగా నిజం. దీపావళి పర్వదినం రోజున హైదరాబాద్ నగరంలో స్థిరపడిన ఉత్తరభారతావనికి చెందిన కొందరితో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు, నగరానికి చెందిన వ్యాపారులు కూడా వున్నట్లు సమాచారం. దీపావళి రోజున పేకాట అడటం వీరికి అనవాయితీ. అయితే తెలంగాణ ప్రభుత్వం పేకట, క్లబ్ లపై ఉక్కపాదం మోపడంతో.. వీరంతా దీపావళి రోజున రహస్యంగా పేకట అడి అడ్డంగా దొరికిపోయారు.

కాగా విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వ్యాపారస్థులు రహస్యంగా పేకాట అడుతున్న సికింద్రాబాదులోని మారియట్ హోటల్ పై దాడులు నిర్వహించారు. పోలీసుల అకస్మాత్తు దాడులతొ బిత్తరపోయిన ప్రముఖులు ఇక చేసేది లేక వారికి లోంగిపోయారు. కాగా దాడుల నేపథ్యంలో అక్కడి తంతు చూసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆశ్చర్యపోయారు. సుమారు 17 రూముల్లో పెద్దఎత్తున పేకాడుతున్న 40 మంది ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు, పేరొందిన ప్రముఖులు ఉన్నట్టు తెలుస్తోంది.

ఆయా గదుల్లోంచి పెద్దఎత్తున కరెన్సీ, విదేశీ కరెన్సీ, విదేశీ మద్యం, హుక్కాలు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా గత మూడు రోజులుగా ఈ హోటల్ లో మకాం వేసి పేకాడుతున్నట్టు తెలుస్తోంది. పేకాడేందుకు వీరందర్నీ ఏకతాటిపై చేర్చింది, హోటల్ లో పేకాట కోసం వారం రోజులపాటు 17 రూమ్ లను బుక్ చేసింది సంజయ్, ప్రవీణ్ అనే వ్యక్తులని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ పరారీలో ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న వ్యక్తుల కోసం గాలింపు చేపట్టారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles