Allahabad HC acquits talwar couple 9 ఏళ్లు.. 3 దర్యాప్తులు.. ఆ దంపతులు నిర్దోషులు..

Aarushi hemraj murder case rajesh and nupur talwar acquitted

Arushi Talwar, Aarushi Talwar, Allahabad High Court, Aarushi Talwar case verdict, Talwar murdered Aarushi case verdict, Who killed Aarushi, Rajesh Talwar, Nupur Talwar, 2008 Noida double murder case, hemraj, CBI, Ghaziabad, Dasna jail, Talwar acquitted‬, latest news

Rajesh and Nupur Talwar were awarded life sentence by a special CBI court in Ghaziabad in 2013 for killing their daughter Aarushi and domestic help Hemraj.

9 ఏళ్లు.. 3 దర్యాప్తులు.. ఆ దంపతులు నిర్దోషులు..

Posted: 10/12/2017 03:31 PM IST
Aarushi hemraj murder case rajesh and nupur talwar acquitted

అనేక మలుపులు, తీవ్ర ఉత్కంఠ, అంతకుమించిన సస్సెన్స్ అన్ని కలగసిని అరుషి తల్వార్ హత్యకేసులో అల‌హాబాద్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పునిచ్చింది. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఈ కేసులో ఆరుషి త‌ల్లిదండ్రులు డాక్టర్ నూపుర్‌ త‌ల్వార్‌, రాజేశ్ త‌ల్వార్ న్యాయస్థానం నిర్దోషులుగా ప్ర‌క‌టించింది. దీంతో నోయిడా జంట హత్యల కేసులో పద్నాలుగేళ్ల అరుషీని, తల్వార్ ఇంటి పనిమనిషి నేపాల్ కు చెందిన హేమరాజ్ ను చంపిందెవరన్న విషయాం మాత్రం ఇప్పటికే స్పష్టం కాలేదు. గత తొమ్మిదేళ్లుగా మూడు పర్యాయాలు దర్యాప్తు సాగినా.. రెండు సార్లు సిబిఐ విచారణ జరిపినా ఈ కేసులో దోషులెవరన్నది మాత్రం తేల్చలేకపోయింది.

ఈ కేసులో సీబీఐ తల్వార్ దంపతులు దోషులని నిరూపించేందుకు స‌రైన ఆధారాలు చూపించ‌లేద‌ని పేర్కొన్న అలహాబాద్ హైకోర్టు.. వారిని నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో గ‌త తొమ్మిదేళ్లుగా సంచలనాలకు కేంద్రబింధువుగా మారిన ఈ కేసులో ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదనే చెప్పాలి. అయితే 2013లో ఘజియాబాద్ సీబిఐ న్యాయస్థానం ఈ కేసు విషయంలో తీర్పును వెలువరించి.. తల్వార్ దంపతులను దోషులగా నిర్థారించి ఆ దంపతులకు జీవిత ఖైదు శిక్షను కూడా ఖరారు చేసింది.

దీంతో 2013 నుంచి దాస్నా జైలులో ఉన్న త‌ల్వార్ దంపతులు శుక్రవారం విడుదల కానున్నారు. అలహాబాద్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో అధికారిక వర్గాల ద్వారా తమకు తల్వార్ దంపతులను విడుద‌ల చేయాలన్న అదేశాలు రావాలని.. అవి అందగానే వారిని విడుదల చేస్తామని దాస్నా జైలు అధికారులు తెలిపారు. కాగా తీర్పు కోసం ఎంతో ఉత్కంతగా జైలులోనే నిరీక్షిస్తున్న రాజేష్ తల్వార్ తమను కోర్టు నిర్దోషులుగా పరిగణించడంతో సంతోషంతో అనందబాష్పాలు రాల్చారని, జైలు సిబ్బందిని కౌగలించుకోగా, నుపూర్ తల్వార్ మాత్రం ఆ సమయంలో దేవుణ్ణి ప్రార్థిస్తూ కనబడిందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arushi Talwar  Allahabad High Court  verdict  Rajesh Talwar  Nupur Talwar  hemraj  CBI  Ghaziabad  Dasna jail  crime  

Other Articles