నవ్యాంధ్ర రాష్ట్రంలో కలిసివస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్న అక్రమార్కుడు ఏకంగా అవినీతి సామాజ్రాన్ని తలపించేలా వందల కోట్ల రూపాయలను గడించాడు. ఆంద్రప్రదేశ్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉన్నతాధికారిగా పని చేస్తున్న రఘు అక్రమాలపై అనేక రోజులుగా పిర్యాదులు అందుతుంటడంతో అయనపై పూర్తిగా నిఘా పెట్టిన కూపీలాగిన ఏసీబీ.. రఘు నివాసంతో పాటు ఆయన బంధువైన శివప్రసాద్ సహా మొత్తం 15 బృందాలుగా విడిపోయి.. రాష్ట్రాలు దాటిన మరీ సాగిన ఆయన అక్రమార్జన చిట్టాను పూర్తిగా గుట్టు విప్పుతున్నారు.
విశాఖపట్నం, విజయవాడ, గన్నవరం, చిత్తూరు, షిర్డీ, హైదరాబాద్, బెంగళూరులోని ఆయనకు సంబంధించిన నివాసాలపై కూపీ లాగిన ఏసీబి అధికారులు ఏకకాలంలో అన్నింటిపై దాడి చేశారు. ఉదయం అరున్నర గంటల నుంచి ఆయన నివాసాలపై దాడులు జరుగుతున్నాయి. దీంతో పాటు అయనకు సన్నిహితంగా మెలుగుతున్న వారితో పాటు సమీప బంధువుల నివాసాలపై కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జూనియర్ టెక్నికల్ ఇంజనీరుగా విదులు నిర్వహిస్తున్న నల్లూరి వెంకట శివప్రసాద్ ఆయనకు సమీప బంధువని తేలడంతో ఆయన నివాసంపై కూడా దాడులు నిర్వహించారు.
భారీ స్థాయిలో అవినీతి, అక్రమాలకు పాల్పడి పెద్దమొత్తంలో అక్రమాస్తులు, డబ్బు సంపాదించారన్న ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు దాడులు చేయగా, ఇటు విజయవాడలోని నల్లూరి వెంటక శివప్రసాద్ నివాసంలో గుట్టల కోద్ది వెండి బంగారు అభరణాలతో పాటు కరెన్సీ కట్టలు, భూముల పత్రాలు లభ్యమైనట్లు కూడా పోలీసులు తెలిపారు. వాటిలో గన్నవరంలోని సుమారు 15 ఏకరాల భూమి పత్రాలు లభ్యమైనట్లు సమాచారం. అది కాకుండా ఇంకా అనేక ప్రాంతాల్లో భూములకు సంబంధించిన పత్రాలు కూడా లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
ఆయన నివాసంలోని తనిఖీలు చేస్తున్న ఏసీబీ అధికారులు షాక్ అయ్యేలా.. మాసిన బట్టలు, వాషింగ్ మెషీన్ కింద, మంచం కింద, బీరువా పోరుగుల్లో ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా బంగారు ఆభరణాలు దొరికాయి. బంగారు విగ్రహాలు కూడా లభ్యమయ్యాయి. వివిధ వస్తువులు, దిమ్మలు, బిస్కెట్ల రూపంలో 50 కేజీల వెండికి మించి లభించిందని అంచనా. అలాగే ఆయన నివాసంలో 10 లక్షల రూపాయల నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. వీటన్నింటిని లెక్కగడుతున్న అధికారులు ఇప్పటి వరకు అవినీతి జలగాల్ని చూశాం.. తిమింగళాలని చూశాం.. కానీ ఇదే తొలిసారి ఏకంగా అవినీతి గాడ్జిల్లాలను చూస్తున్నామని పేర్కోన్నట్లు సమాచారం.
అలాగే గన్నవరం సమీపంలో 300 ఎకరాల వెంచర్ కు సంబంధించిన పత్రాలు కూడా దొరికాయన్న వార్తలు వెలువడుతున్నాయి. గన్నవరంలోని ప్రస్తుతం ఆయన నివాసం ముందే 40 సెంట్ల భూమి ఉన్నట్టు గుర్తించారు. అలాగే షిర్డీలో ఒక లాడ్జి, వేల్పూరులో రెండెకరాల వ్యవసాయ భూమి, విజయవాడలో 16 ఫ్లాట్లు ఉన్నట్టు గుర్తించారు. అంతే కాకుండా డబ్బులు లెక్కించేందుకు ఆయన నివాసంలోనే మనీ కౌంటింగ్ మెషీన్ కూడా ఉండడం విశేషం. ఇవన్నీ చూసి కళ్లు చెదిరిన ఏసీబీ అధికారులు లెక్కింపు ప్రారంభించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more