Women Quarrel for Bathukamma Sarees ఇక్కడ సిగపట్లు.. అక్కడ నిరసన జ్వాలలు

Women set afire cheap quality bathukamma sarees

women protest bathukamma sarees, women quarrel for bathukamma sarees, hyderabad women fight for TS gifts, Jangaon, Yadadri, hyderabad, Telangana Chief Minister K. Chandrasekhar Rao, Peddapalli, Bathukamma Sarees, Nandimedaram Village, Budajangala Colony

Telangana women set afire a pile of Bathukamma sarees distributed by the state government protesting against their cheap quality.

ప్రచారమేమో చేనతకు.. పంచేదేమో పాలిస్టర్ చీరలా..?

Posted: 09/18/2017 06:46 PM IST
Women set afire cheap quality bathukamma sarees

తెలంగాణలోని ప్రభుత్వం గతానికి విభిన్నంగా రాష్ట్ర అడపడచులకు సారేగా పంచిన చీరలపై రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మహిళలు నిరసనను వ్యక్తం చేశారు. పలు జిల్లాల్లో మహిళలు ఈ చీరలను కట్టుకోవాలా..? అంటూ ఏకంగా రాస్తారోకోలు నిర్వహించి నిప్పంటించారు. ప్రభుత్వం కానుకగా ఇచ్చిన చీరలు నాసిరకంగా వున్నాయంటూ ధ్వజమెత్తారు. నిరసనల్లో పాల్గోన్న మహిళలు తెలంగాణ ప్రభుత్వం అడపడుచులకు చీరలని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని లోపభూయిష్టమైన చీరలను పంపిణీ చేసిందని మండిపడ్డారు.

ఇక మరికోందరు మాత్రం నిజామాబాద్ ఎంపీ ఇలాంటి చీరలనే కట్టుకుంటుందా..? లేక తమను చులకన చేయాలనే ఇలాంటి చీరలను పంచారా..? అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసేది చేనేత పనులకు కానీ అడపడచులకు పంచేది మాత్రం నాసిరకం పాలిస్టరు చీరలా అంటూ నిలదీస్తున్నారు. రూ.222 కోట్ల రూపాయలను వెచ్చింది.. సుమారుగా కోటి నాలుగు లక్షల 47 వేల 610 చీరలను పంచాలని నిర్ణయించుకున్న ప్రభుత్వానికి వ్యతిరేక సెగను అసలు ఊహించలేదు.

అయితే చేనేత శాఖ వర్గాలు మాత్రం ప్రభుత్వం ప్రచారమే కాదు.. చేనేతను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో సుమారు 52 లక్షల చేనేత చీరలను సేకరించి పంపిణీ చేసిందని.. వీటన్నింటినీ సిరసిల్ల చేనేత నుంచే కొనుగోలు చేసిందని చెప్పారు. దీంతో సిరిసిల్ల సహా పరిసర ప్రాంతాల్లోని చేనేతలకు రూ. 70 కోట్ల మేర వ్యాపారం జరిగిందని కూడా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ డిమాండుకు సరిపడా చీరలు అందుబాటులో లేకపోవడంతో అధిక భారమైనా పాలిస్టర్ చీరలను కొనుగోలు చేసి పంపించామని పేర్కోన్నాయి.

ఇక ఇటు హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం ఇచ్చే కానుకలను అందుకునేందుకు మహిళలు ఏకంగా సిగపట్లు పట్టారు. ముష్టిగాతాలకు కూడా తెరలేపారు. సైదాబాద్ లో చీరల పంపిణీలో కొందరు మహిళలు ఘర్షణకు దిగారు. రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మహిళా కానిస్టేబుల్ ఒక్కరే ఉండడంతో ఘర్షణను అడ్డుకోలేకపోయారు. ఉదయం నుంచి చీరల కోసం వేచి చేస్తుండగా, కోందరు క్యూలైన్ల మధ్యలోకి వెళ్లడంతో.. రెండు వర్గాల మధ్య ఘర్షణకు తెరలేచింది. సుమారు పది నిమిషాల పాటు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ వీరంగం సృష్టించారు.

మహిళల ఘర్షణ పడుతుండడంతో అధికారులు ప్రేక్షక పాత్ర పోషించారు. ఘటనాస్థలంలోని పోలీసులు అడవారిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియకపోయినా.. అడ్డుగా నిలుస్తూ.. రెండువర్గాలను విడిపించారు. అయినా మరోచోటు ఈ గ్రూపులోని సభ్యులు ఖయ్యానికి సై అన్నారు. సైదాబాద్ శిశుమందిర్ లో పాఠశాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యం, ప్రణాళికారాహిత్యం కొట్టోచ్చినట్టు కనిపించిందని విమర్శలు వినవస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles