Hindu Organisation Wing Releases Names of 14 Fake Godmen

Fake godmen list released

Akhil Bhartiya Akhara Parishad, Fake Godmen List, Fake Babas, Asaram Son Fake Baba, Babas in India, Fake Babas in India, Indian Godmen Scandals

Akhil Bhartiya Akhara Parishad releases names of 14 fake godmen. The saints have called for a total boycott of the blacklisted godmen and asked the people to beware of them.

దొంగ బాబాల లిస్ట్ రిలీజ్ చేసేశారు

Posted: 09/11/2017 07:18 AM IST
Fake godmen list released

అత్యాచారం కేసులో డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ సింగ్ రామ్ రహీమ్ కటకటాల పాలయ్యాడు. కాస్తలో బాబా రాంపాల్ కు హత్య కేసు నుంచి ఊరట లభించింది. అయితే ఆ వెంటనే వరస పెట్టి బాబాల వ్యవహారాలు కోర్టు గడప తొక్కుతుండటంతో హిందూ సంఘాలు రంగంలోకి దిగాయి. తమను తాము దేవుళ్లుగా ప్రకటించుకుంటున్న వారి వల్ల మొత్తం సాధు సంతులుకు చెడ్డపేరు వస్తోందని అఖిల భారతీయ అఖాడా పరిషత్ ఆవేదన వ్యక్తం చేసింది.

అంతేకాదు దొంగ బాబాల లిస్ట్ ను కూడా రిలీజ్ చేసేసింది. 14 మందితో కూడిన జాబితాను అఖాడా పరిషత్ తయారు చేసింది. గుర్మీత్, రాంపాల్, రాధేమా, ఓం బాబా, నిర్మల బాబా, అఖాడా పరిషత్... ఇలా జాబితాలో ఉన్నారు. అత్యాచారం కేసులో అరెస్టయిన వివాదాస్పద మతగురువు ఆశారాం బాపు కుమారుడు నారాయణ్ సాయి కోసం ఆయన కుమారుడు నారాయణ్ సాయి తదితరులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇటువంటి దొంగ బాబాల వల్ల ‘సంత్’కు ఉన్న గౌరవం దెబ్బ తింటోందని అఖాడా పరిషత్ అధ్యక్షుడు స్వామి నరేంద్ర గిరి అన్నారు.

ఇకపై సంత్‌కు ఉన్న గౌరవాన్ని కాపాడేందుకు కొన్ని నిబంధనలు, ఆంక్షలు విధిస్తూ అఖాడా పరిషత్ నిర్ణయం తీసుకుంది. ఆధ్యాత్మిక సేవలో ఉన్నవారిని ఇకపై వారి వ్యవహారాలను పూర్తిగా తెలుసుకున్నాకే సంత్‌గా గుర్తిస్తారు. సాధువులకు ఇకపై వ్యక్తిగతంగా ఎటువంటి ఆస్తులు కానీ, నగదు కానీ ఉండకూడదని అఖాడా పరిషత్ నిర్ణయించినట్టు వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ తెలిపారు. ఈ లిస్ట్ లో ఉన్న నకిలీ స్వామీజీలను బ్యాన్ చేస్తున్నట్లు సాధువుల సంఘం ప్రకటించింది కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles