Telugu Students restircted from writing Bank Exam తెలుగు విద్యార్థులను అడ్డుకున్న కన్నడ సంఘాలు..

Kannada students protest against telugu students attending for bank exam

kannadigas restrict telugus from writing bank exam, kannadigas, kannada songams, hubli, telugu people, ibps exam, bank employment, hall tickets, police

Banking personal selection exams lead to tension situation in Karnataka. Kannada Associations staged protests outside the exam centers against allowing non-locals for the exams in Hubli over which Officers cancelled the exam.

ITEMVIDEOS: తెలుగు విద్యార్థులను అడ్డుకున్న కన్నడ సంఘాలు..

Posted: 09/09/2017 12:35 PM IST
Kannada students protest against telugu students attending for bank exam

కర్ణాటకలోని యువతకు దక్కాల్సిన ఉద్యోగాలను తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కొల్లగొడుతున్నారన్న అరోపణలతో ఇవాల కర్ణాటక వ్యాప్తంగా జరుగుతున్న ఐబీపీఎస్, ఆర్ఆర్ బి పరీక్షలను రాసేందుకు బెంగుళూరు. హుబ్లీ సహా పలు కర్ణాటక పట్టణాలకు వెళ్లిన తెలుగు విద్యార్థులపై కన్నడీగులు అడ్డుకున్నారు. దీంతో కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటకలోని ఏ పరీక్షలకు కూడా ఇతర రాష్ట్రవాసులు హాజరుకాకూడదన్న ఉద్దేశ్యంతో కన్నడ సంఘాల నేతలు అడ్డుకున్నారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను పరీక్షా హాల్‌ వద్ద అడ్డుకొని హాల్ టికెట్లు చించివేసి కన్నడ సంఘాల నేతలు వీరంగం సృష్టించారు. బెంగళూరు, హుబ్లీ సహా పలు ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ల వద్ద కన్నడ సంఘాలు ఆందోళన చేపట్టాయి. అంతటితో అగకుండా ఏకంగా పరీక్షా కేంద్రాల వద్ద కూడా అందోళనకారులు పెద్దస్థాయిలో చేరుకుని తెలుగు విద్యార్థులను అడ్డుకున్నారు. కన్నడిగుల తీరుతో తెలుగు విద్యార్థులు హుబ్లీలో ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. . పోలీసులు రంగప్రవేశం చేసి కన్నడ సంఘాల నేతలను అడ్డుకున్నారు.

తమ రాష్ట్రంలో వేరే రాష్ట్రాలకు చెందిన వారు వచ్చి ఐబీపీఎస్ నిర్వహించే పరీక్షలు రాయడానికి వీల్లేదని ఇప్పటికే కన్నడ సంఘాలు హెచ్చరించినా.. వాటిని పట్టించుకోకుండా పరీక్ష అర్హతలలో ఈ నిబంధనలు లేకపోవడంతో వెళ్లిన తెలుగు అభ్యర్థులు కర్ణాటకలో అవస్థలు పడ్డారు. బ్యాంకు పోస్టుల భర్తీకి అన్ని అర్హతలు వున్న ఔత్సాహికులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కర్ణాటకకు వెళ్లగా అక్కడి సంఘాల నేతలు తమను అడ్డుకోవడమేంటని తెలుగు విద్యార్థులు అక్షేపిస్తున్నారు.

కన్నడ సంఘాలు హెచ్చరికలు జారీ చేస్తూ తమను పరీక్షలు రాయకుండా అడ్డుకుంటున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. తమను పరీక్షలు రాయకుండా అడ్డుకోవడం కన్నా.. కన్నడ సంగాలు బ్యాంకు యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకువచ్చి.. కన్నడీగులలో అర్హతలున్న ఔత్సాహికులతో మత్రమే తాము తమ బ్యాంకు ఖాళీలను భర్తీ చేసుకుంటామన్న నిబంధన పెట్టించే ప్రయత్నం చేయాలని తెలుగు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కన్నడ సంఘాల ఆందోళనతో పరీక్ష ను రద్దు చేశారని.. తాము అనేక వ్యయప్రయాసలు పడి వచ్చి కూడా నిరాశతో వెనుదిరగాల్సి వస్తుందని వాపోయారు. గతంలో ఈ తరహా నిబంధన కొనసాగినా.. కర్ణాటకలో బీజేపి సర్కార్ హయాంలోనే ఈ నిబంధనను తొలగించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles