diseases target Gorakhpur children గోరక్ పూర్ లో అగని చిన్నారుల మరణమృదంగం

After hospital tragedy flood induced diseases target gorakhpur children

Gorakhpur, state of health in Gorakhpur, Gorakhpur children​, BRD Medical College,​ Children suffering from stomachache

A new danger now haunts the children in Gorakhpur, even before encephalitis could have been tackled, the havoc of flood left behind in the form of garbage, filthy water, and insanitary conditions is leading to spread of diseases

గోరక్ పూర్ లో అగని చిన్నారుల మరణమృదంగం

Posted: 09/06/2017 05:03 PM IST
After hospital tragedy flood induced diseases target gorakhpur children

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోరఖ్ పూర్ లోని బీఆర్డీ మెడికల్ కాలేజీ అసుపత్రిలో చిన్నారుల మరణమృదంగం ఇంకా కోనసాగుతుంది. వివిధ రోగాల పాలైన చిన్నారులను అరోగ్యాలను పరిరక్షించడంలో వైద్యులు విఫలం కావడంతో తాజాగా మరికోందరు చిన్నారులకు అసువులు బాసాయి. ఇవాళ మరణించిన మరో పది మంది చిన్నారులతో అస్పత్రి అవరణలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఈ ఏడాది మొత్తంగా ఈ అసుపత్రిలో మరణించిన వారి సంఖ్య 1351కి చేచగా, కేవలం అగస్టు మాసం నుంచి మరణించిన చిన్నారుల సంఖ్య 415కు చేరింది. దీంతో అస్పత్రి విధులు నిర్వహించిన మాజీ ప్రిన్సిపాల్ రాజీవ్ మిశ్రాతో పాటుగా అతని భార్యపై నమోదైన ప్రజాప్రయోజన వ్యాజ్యం నేపథ్యంలో కోర్టు నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ చేయడంతో.. వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై నాన్ బెయిలెబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇక ఉత్తర్ ప్రదేశ్ యోగీ అధిత్యనాథ్ ప్రభుత్వం చిన్నారుల మరణాల సమస్యలను పరిష్కరించేందుకు బుదులు చేత్తులెత్తేసే విధంగా చర్యలకు పాల్పడడంపై కూడా విపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. చిన్నారుల మరణాలకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలా..? అన్న మాటలతో పిల్లల తల్లిదండ్రులు తీవ్ర అగ్రహంతో వున్నారు. కాగా ఇటు అస్పత్రిలో మాత్రం ఇంకా చిన్నారుల మరణాలు కొనసాగుతున్నాయి. ఈ లోపు గోరఖ్ పూర్ ప్రాంతవాసులకు మరో అందోళన వెంటాడుతుంది.

ఏకధాటిగా కురిసిన వర్షాలతో.. ముంపుకు గురైన ప్రాంతాలను మరిన్ని వ్యాధులు వెంటాడే అవకాశాలు లేకపోలేదు. గోరక్ పూర్ ప్రాంతంలో చెత్తాచెదారం, నీటి ముంపులతో అక్కడి చిన్నారులను వ్యాధులు సంక్రమించే ముప్పు వుందని అందోళన వ్యక్తం అవుతుంది. అయితే ఈ వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకోవడంలో జిల్లా అరోగ్యశాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలు వినబడుతున్నాయి. ఇక మరోవైపు రాజస్తాన్ లోని రామ్ మనోహర్ లోహియా అస్పత్రిలోనూ చిన్నారుల మరణాలు కొనసాగడం కలకలం రేపుతుంది. రాజస్థాన్ లో చిన్నారుల మరణాల నేపథ్యంలో జాతీయ మానవహక్కుల కమీషన్ ప్రభుత్వంతో పాటు అస్పత్రి యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles