Husband sings Romantic Song for Wife in police station కేసుపెట్టేందుకు వెళ్లిన భార్యను దారికి తెచ్చుకున్న భర్త..ఎలా..?

Husband sings romantic song for wife in police station

Husband, Romantic, badlapur Song, Wife, Unhappy, Viral Video, Video Viral, viral news, UP police, UP news, Jhansi, uttar pradesh, crime

Viral Video Husband Sings Romantic Song For Unhappy Wife in police station, after she approches police station to file a complaint against him.

ITEMVIDEOS: కేసుపెట్టేందుకు వెళ్లిన భార్యను దారికి తెచ్చుకున్న భర్త..ఎలా..?

Posted: 08/30/2017 10:32 AM IST
Husband sings romantic song for wife in police station

ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాన్సీలో ఓ భర్త తనతో పడదని పేర్కోంటూ చీకోట్టి వెళ్లి..ఏకంగా పోలీసు కేసు నమోదు చేయగా, ఆ భార్య తాను లాలించి.. బుజ్జగింజి.. అలక తీర్చీ.. అమె లేకండా తాను వుండలేనంటూ.. తనకు బతకడం నేర్పించిన అమె వెళ్లిపోతే ఎలా అంటూ.. ఇక తన జీవితం ఏంటంటూ అర్థం వచ్చేలా సముదాయించి.. అమెను తనతో పాటు తీసుకెళ్లాడు. అమెతో పాటు పోలీస్ స్టేషన్ లో వున్న మహిళా పోలీసులు కూడా భర్త చేసిన పనికి మురిసిపోయి.. హర్షధ్వానాల ద్వారా కొందరు.. అభినందిస్తూ కోందరు అతన్ని కొనియాడారు. ఇంతకీ ఆ భర్త చేసిన పనేంటి..?

భర్తతో పడలేక, చీకొట్టి వెళ్లిపోయిన ఓ భార్య.. తన భర్తపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, స్టేషన్ నుంచి పోలీసులు భర్తకు ఫోన్ చేసి స్టేషన్ కు రావాల్సిందిగా ఫోన్ చేశారు. దీంతో స్టేషన్ కు వెళ్లిన భర్త కొద్దిసేపటి తరువాత తన భార్యతో ఎంచక్కా బయటకు వచ్చేశాడు. అసలు స్టేషన్ లోపల ఏం జరిగింది. ఈ మిస్టరీ విషయంలోకి ఎంటరైతే.. సినిమాల్లో ఒక శిశువు బాలుడిగా ఎదిగేందుకు ఓ మూడున్నర నిమిషాల పాట దోహదపడినటినట్లుగానే.. ఇక్కడ కూడా భార్య అలక తీర్చడానికి భర్త ఎంచుకున్నది కూడా మంచి పాటనే. ఒక్క పాటలో తన మదిలో అమెపై వున్న ప్రేమను వ్యక్తం చేయగా, అమె కూడా భర్త మదిలో తనపై వున్న ప్రేమను చూసి కరిగిపోయింది.

వివరాల్లోకి వెళితే, భార్య తన భర్తపై ఫిర్యాదు చేయడంతో ఆ జంటకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు నిర్ణయించుకున్న పోలీసులు ఇద్దరినీ పిలిపించారు. ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు కూడా సదరు యువతి భర్తపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇక ఆమె కోపాన్ని చల్లార్చాలని నిర్ణయించుకున్న ఆ భర్త తన మధురమైన గానాస్త్రాన్ని బయటకు తీశాడు. 'బద్లాపూర్' చిత్రంలోని 'జినా.. జినా...' అంటూ పాటను అందుకున్నారు. దీంతో కరిగిపోయిన ఆయన భార్య కన్నీరు పెట్టుకుంటూ వచ్చిన భర్త అక్కున చేరిపోయింది. ఈ ఘటనను పోలిస్ స్టేషన్ లో ఎవరో వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్తా నెట్టింట్లో సంచలనంగా మారింది. అలస్యమెందుకూ మీరూ ఓ లుక్ వేయండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Husband  Romantic  badlapur Song  Wife  Unhappy  Viral Video  Video Viral  viral news  UP police  UP news  Jhansi  uttar pradesh  crime  

Other Articles