నంద్యాల ఉపఎన్నికు మరికొన్ని నిమిషాలలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభంకానుంది. ఈవీఎం మిషన్లలో నిక్షిప్తమైన ఓటరు తీర్పును ఇవాళ బహిర్గతం కానుంది. నువ్వా-నేనా అన్నట్లు అధికార, ప్రధాన ప్రతిపక్షం మధ్య సాగిన పోరులో ప్రజలు ఎవరివైపు వున్నారు.. ఎవరని అదరించారన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. నంద్యాలలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
మొదట నంద్యాల గ్రామీణ మండలం, అనంతరం నంద్యాల పట్టణానికి సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత గోస్పాడ్ పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా,14 టేబుళ్ల వద్ద నంద్యాల ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తం 19 రౌండ్లలో ఓట్లను లెక్కింపు పూర్తి కానుంది. ఒక్కో రౌండ్ కు సుమారు 20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఒక్కో టేబుల్ వద్ద సూపర్ వైజర్, సహాయకుడు, సూక్ష్మ పరిశీలకుడు ఉంటారు.
ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి పోటీ చేసిన అభ్యర్థి సహా ఏజెంటుకు మాత్రమే ప్రవేశించి అనుమతి ఉంది. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి వెళ్లాలంటే ఈసీ జారీ చేసిన పాసు తప్పనిసరిగా ఉండాలి. ఎలక్ట్రానిక్ తెరల ఏర్పాటు తో మీడియాకు ఎప్పటికప్పుడు సమాచారం అందించనున్నారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పొలింగ్ తరువాత రోజు వైసీపీ నేత సలీంపాషా అంత్యక్రియలలో రేగిన హింస, ఉద్రిక్తత నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకునిభారీ పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు.
నంద్యాల పట్టణంలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. 12 మంది డీఎస్పీలు, 18 మంది సీఐలు, 63 మంది ఎస్సైలు, 58 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 232 మంది కానిస్టేబుళ్లు, 18 మంది మహిళా కానిస్టేబుళ్లు, 12 స్పెషల్ పార్టీలు, 118 మంది హోంగార్డులు, స్ట్రైకింగ్ ఫోర్స్ 5, ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్ 3 మొబైల్ పార్టీలు 12, ఒక సీఆర్పీఎఫ్ కంపెనీ, 4 ఏపీఎస్పీ ప్లాటూన్లు, 21 పికెట్లతో కలిపి 600 మంది సిబ్బందిని నియమించారు. కౌంటింగ్ కేంద్రం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more