ట్రిపుల్ తలాక్ తాత్కాలికంగా చెల్లదు.. కొత్త చట్టం తేవాలంటూ తీర్పు | Supreme Court has struck down Triple Talaq

Supreme court has struck down triple talaq

Supreme Court, Supreme Court Triple Talaq Verdict, Supreme Court Triple Talaq Struck Down, SC's injunction Triple Talaq, Triple Talaq Six Months, Triple Talaq Petitioners, Triple Talaq Historic Verdict

Supreme Court of India has struck down Triple Talaq in a split verdict. If law doesn't come in force in six months, then SC's injunction on Triple Talaq will continue.

ట్రిపుల్ తలాక్ చెల్లదు... : సుప్రీంకోర్టు

Posted: 08/22/2017 10:59 AM IST
Supreme court has struck down triple talaq

భారతీయ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ముస్లిం చట్టాల్లోని వివాదాస్పదమైన ట్రిపుల్ తలాక్ చెల్లదంటూ తెలిపింది. ఆరు నెలల పాటు ట్రిపుల్ తలాక్ పై స్టే విధిస్తున్నామని, ఈలోగా పార్లమెంట్ లో అవసరమైన సవరణ చేసి కొత్త చట్టం తేవాలని పార్లమెంటు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

అంతవరకూ తమ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేస్తూ, ఇంజక్షన్ ఆర్డర్ వేసింది. కేసులో తాము కల్పించుకోవాలన్న ఉద్దేశం లేదు. అయితే, కేసు తీవ్రత దృష్ట్యా, తాత్కాలిక ఆదేశాలు ఇస్తూ, నిర్ణయాధికారాన్ని పార్లమెంట్ కే వదిలేస్తున్నాం అని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. ఆర్టికల్ 14, 21 ను ట్రిపుల్ తలాక్ ఉల్లంఘించట్లేదని, రాజ్యంగబద్ధత చెల్లుబాటు కాదనే అంశం విషయంలో జోక్యం చేసుకోబోమని తెలిపింది. కానీ, మూడు సార్లు తలాక్ చెప్పడం ద్వారా భార్యను వదిలించుకోవాలని చూడటం అత్యంత హేయమైన చర్యని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. ఫోన్ లేదా సామాజిక మాధ్యమాల్లో తలాక్ చెప్పడం చట్ట సమ్మతం కాదని, అటువంటివి చెల్లబోవని పేర్కొంది.

కొత్త చట్టం తెచ్చేటప్పుడు ముస్లిం లాబోర్డు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని పార్లమెంట్ కు సుప్రీంకోర్టు సూచించింది. ఒకవేళ ఈ ఆరు నెలలో కొత్త చట్టం తేని యెడల తమ ఇంజక్షన్ ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.  ఈ కేసులో ఇరు పక్షాలు సుదీర్ఘ వాదనలు వినిపించగా, తుది తీర్పు కోసం యావత్ దేశం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  Triple Talaq  Injunction Orders  

Other Articles