TTV Dinakaran camp opposes AIADMK merger విలీనం చెల్లదు.. సీఎం సభ్యుల నమ్మకాన్ని కోల్పోయారు..

Ttv dinakaran camp opposes aiadmk merger to meet governor today

Edappadi Palaniswami, VK Sasikala, O Panneerselvam, J Jayalalithaa, no-confidence motion, DMK, BJP, Stalin, TTV Dinakaran, AIADMK merger, MK Stalin, Dinakaran camp opposes merger

Hours after the two warring factions of the AIADMK merged, around 20 MLAs from the ruling Tamil Nadu government have expressed their dissatisfaction.

విలీనం చెల్లదు.. సీఎం సభ్యుల నమ్మకాన్ని కోల్పోయారు..

Posted: 08/22/2017 09:52 AM IST
Ttv dinakaran camp opposes aiadmk merger to meet governor today

తమిళనాడులో రాజకీయ అనిశ్చితి.. అన్నాడీఎంకేకు చెందిన రెండు వర్గాలు రెండాకులుగా విడిపోయి.. క్రితం రోజున కలిసిన తరువాత కూడా కుదుటపడినట్లు లేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పళని స్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వంలు తాము ఒకటై తమిళనాడును ఏలుకుందామని అశించినా వారి అశలు ఫలించే అవకాశాలు లేకుండాపోతున్నాయి. అందుకు కారణం.. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన పార్టీ ఉప ప్రధానకార్యదర్శి టీటీవి దినకరణ్ కు మద్దతుగా 18 మంది ఎమ్మెల్యేలు గళం విప్పడమే.

దినకరణ్ కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు. పార్టీ నుంచి శశికళను బహిష్కరించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. వీరందరూ క్రితం రోజున మెరినా బీచ్ లోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద మీడియాతో మాట్లాడుతూ.. తాము వీలీనానికి వ్యతిరేకమని ప్రకటించారు. అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు కలయిక తమ నమ్మకాన్ని దెబ్బతీసిందని అరోపించారు. ఆరు నెలల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పళనిస్వామి తమ నమ్మకాన్ని కోల్పోయారని ఈ నేపథ్యంలో టీటీవీ దినకరణ్ ఇవాళ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావును కలసి తమ వ్యతిరేకతను తెలుపుతూ లేఖను సమర్పిస్తారని అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన వద్ద 25 మంది ఎమ్యెల్యేలు ఉన్నారన్నారు. తమ ఎమ్మెల్యేల నమ్మకాన్ని పళనిస్వామి కొల్పోవడంతో వారు ఆయనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారని అన్నారు. దీంతో ఆయన మళ్లీ బలనిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పారు. అయితే 233 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో అధికారంలో వున్న పళనిస్వామి ప్రభుత్వం నిలదొక్కుకోవాలంటే కచ్చితంగా 117 మంది సభ్యుల బలం కావాలి.

కానీ 25 మంది సభ్యులు మద్దతును ప్రభుత్వం కోల్పోయిన పక్షంలో ప్రభుత్వ మనుగడకే ప్రమాదం ఏర్పడనుంది. దీంతో ఉంటుందో, ఊడుతుందో చెప్పలేని పరిస్థితులు ఉత్పన్నమై.. మరోమారు రాజకీయ అనిశ్చితి తెరపైకి రానుందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. కాగా ప్రతిపక్ష డీఎంకే మాత్రం పదవిని కాపాడుకునేందుకు పన్నీర్‌, పళని కలిశారని.. ఇదంతా కేంద్రంలోని బీజేపి రచించిన స్క్రిప్టు ప్రకారం ఇక్కడ రెండు వర్గాలు నటిస్తున్నాయని అన్నారు. తాము పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు కూడా తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIADMK merger  Palaniswami  Panneerselvam  TTV Dinakaran  DMK  BJP  Tamil Nadu  

Other Articles