mudragada house arrest till august 2nd వారం రోజుల వరకు ముద్రగడ హౌజ్ అరెస్ట్

Mudragada padmanabham house arrest till august 2nd

mudragada padayatra, mudragada house arrest, tension in amaravathi, mudragada chalo amaravati call, kapu caste leader mudragada padmanabham, AP DGP, N. Sambasiva Rao, warning, kapu leader, mudragada padmanabham, chalo amaravathi, padyatra, chandrababu, election promise

kapu caste leader mudragada padmanabham is under house arrest till august 2nd, as he gives call for chalo amaravati

వారం రోజుల వరకు ముద్రగడ హౌజ్ అరెస్ట్

Posted: 07/27/2017 12:40 PM IST
Mudragada padmanabham house arrest till august 2nd

కావులకు రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ తో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన చలో అమరావతి పాదయాత్ర నేపథ్యంలో ఆయనకు పోలీసులు మరో షాక్ ఇచ్చారు. ఆయనను వారం రోజుల పాటు గృహ నిర్భంధంలో ఉంచారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ అదేశాల ప్రకారం ముద్రగడ పద్మనాభాన్ని 7 రోజుల పాటు హౌజ్ అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. నిన్న ముద్రగడ తానిచ్చిన పిలుపు మేరకు ఛలో అమరావతి పాదయాత్రకు బయలుదేరుతుండగా, అయనను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు అయనను గృహనిర్భంధంలో ఉంచారు.

అయితే తాజాగా జిల్లా కలెక్టర్ జారీ చేసిన అదేశాల మేరకు ఆయన హౌజ్ అరెస్టును వారం రోజుల పాటు పొగిడిస్తూ అగస్టు 2 వరకు ఆయన హౌజ్ అరెస్టులో వుండాల్సిందేనని తెలిపారు. పోలీసులు తాజాగా వెలువరించిన కలెక్టర్ అదేశాలను ముద్రగడ పద్మనాభానికి తెలపిన నేపథ్యంలో ఆయన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. వారం రోజుల పాటు ఇంట్లోనే నిర్భంధంలో వుంచడం కన్నా తనను ఏకంగా జైల్లోనే పెట్టోచ్చు కదా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల అదేశాలను మాత్రమే తాము ఫాలో అవుతున్నామని పోలీసులు తెలిపారు.

కాగా ముద్రగడ కూడా పోలీసుల వ్యూహానికి చెక్ పెట్టారు. వారం రోజుల గృహనిర్భంధం తరువాతే తన ఛలో అమరావతి పాదయాత్రను చేపట్టనున్నట్లు ముద్రగడ స్పష్టం చేశారు. ఆగస్టు 2 వరకు తనను హౌజ్ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆగస్టు 3న ఉదయం తొమ్మిది గంటల కల్లా తాను సిద్దంగా వుంటానని, అరోజునే ఛలో అమరావతి పాదయాత్ర చేపడతామని చెప్పారు. మూడేళ్ల క్రితం ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చమని డిమాండ్ చేస్తే.. తమ కులస్థుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తనను గృహనిర్భంధంలో వుంచిదని మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mudragada  mudragada padmanabham  house arrest  kapu caste leader  chalo amaravati  

Other Articles