Grand alliance won't break, says Nitish Kumar మా బిడ్డను మేమేందుకు చంపుకుంటాం..

Grand alliance won t break it s our baby says nitish kumar

nitish kumar, lalu yadav, lalu yadav cbi raids, tejeswi yadav, deputy chief minister, grand alliance, rjd-jdu alliance, grand alliance, ram nath kovind, congress, sonia gandhi, rjd jdu congress alliance, Congress chief Sonia Gandhi, india news, latest news

Bihar Chief Minister Nitish Kumar is believed to have had a “good” discussion with Congress chief Sonia Gandhi on a day the Janata Dal (United) clearly spoke about keeping the grand alliance in the state alive

కిస్సా కుర్చీకా: మా బిడ్డను మేమేందుకు చంపుకుంటాం..

Posted: 07/13/2017 09:10 PM IST
Grand alliance won t break it s our baby says nitish kumar

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తన అధికార పరపతిని వినియోగించి కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా కొనసాగిన హాయంలో అక్రమాలకు పాల్పడ్డారని, అతనితో పాటు అతని కుడమారుడు కూడా అవకతవకలకు పాల్పడ్డారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇక బీహార్ లో అర్జేడీతో అధికార జేడీయు పోత్తుకు తెరపడుతుందని అంతా భావించారు. ఈ క్రమంలో ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ను పదవిలోంచి దిగిపోవాల్సిందిగా నాలుగు రోజుల సమయాన్ని కూడా బీహర్ సీఎం నితీష్ ఇచ్చారన్న వార్తలు వచ్చాయి.

ఈ తరుణంలో ఆయన.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో భేటీ తరువాత ఆయన ఉన్నఫలంగా మాట మార్చారు. అర్జేడీతో తాము మైత్రిని ఎందుకు వదులుకుంటామని ప్రశ్నించారు. అర్జేడీకి కటీఫ్ చెప్పే అవకాశాలే లేవని ఆయన స్పష్టం చేశారు. లాలూతో కలసి పెంచుకున్న బిడ్డే 'మహాఘటబంధన్' అని అభివర్ణించిన ఆయన, తన బిడ్డను తానే ఎలా చంపుకుంటానని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో టెలిఫోన్ లో మాట్లాడిన ఆయన, ఆపై తన మనసులోని మాట చెప్పారు. తెగదెంపులు ఉండబోవని కుండబద్దలు కొట్టారు.

లాలూ కుటుంబంపై సీబీఐ దాడులు, అంతకన్నా ముందు యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్ ను కాదని, మోదీ ఎంపిక చేసిన కోవింద్ కు మద్దతు పలకడం తదితర పరిణామాలతో నితీశ్, లాలూ మధ్య బంధం విడనుందని, ఆ తరువాత బీజేపీ మద్దతుతో నితీశ్ ప్రభుత్వం కొనసాగుతుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక లాలూ ఇళ్లపై సీబీఐ దాడులు మొదలైన తరువాత, తొలిసారిగా క్యాబినెట్ సమావేశాన్ని నితీశ్ ఏర్పాటు చేయగా, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కూడా హాజరయ్యారు. ఆపై ఆయన మాట్లాడుతూ, అమిత్ షా, నరేంద్ర మోదీలు తమ కుటుంబంపై కక్ష కట్టారని ఆరోపించారు. నితీశ్ తాజా వ్యాఖ్యలతో తేజస్వీ యాదవ్ పదవికి, ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు లేనట్టే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles