Woman alleges rape after video of BJP leader kissing her కదులుతున్న బస్సులో యువతిపై బిజేపి నేత అఘాయిత్యం..

Video of bjp leader kissing in moving bus goes viral woman alleges rape

Maharashtra BJP leader sex video, viral video, Ravindra Bawanthade viral video, BJP, BJP leader sex video, Ravindra Bawanthade sex video, ravindra bawanthade viral video, BJP, Chandrapur, Gadchiroli district, video viral

A video of a man kissing a woman in a moving bus has gone viral in Maharashtra. The woman has now filed a rape case against the man who is a BJP leader.

ITEMVIDEOS: కదులుతున్న బస్సులో యువతిపై బిజేపి నేత అఘాయిత్యం..

Posted: 07/04/2017 04:08 PM IST
Video of bjp leader kissing in moving bus goes viral woman alleges rape

కదులుతున్న బస్సులో యువతిపై అత్యాచారం చేసిన నిర్భయ ఘటన యావత్ దేశ ప్రజలను అత్యాచారాలపై, అడపడచులపై జరుగుతున్న అఘాయిత్యాలపై కన్నెరచేసేలా చేసింది. ఈ దెబ్బతో అప్పట్లో కేంద్ర, రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ప్రజాగ్రహం ముందు కోట్టుకుపోయారు. సరిగ్గా అలాంటి అఘాయిత్యానికే పాల్పడో బిజేపి పోలిటికల్ లీడర్. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా చంద్రాపూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు బస్సులోని సిసిటీవీల్లోంచి అంతర్జాలంలోకి వెళ్లడంతో ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వం షక్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆ బస్సులో వెనక సీట్లలో ప్రయాణికులు లేరు. అయితే ముందు సీట్లలో ప్రయాణికులు ఉన్నా ఈ కామాంధ నేత మాత్రం అడ్డుఅదుపులేకుండా జంకుబోంకు లేకుండా .. తన సీటులో పక్కనే ఉన్న మహిళకు ముద్దులు పెట్టాడు. ఒకటీ, రెండు కాదు.. అలా చాలా సమయం ఆ మహిళతో మిస్ బిహేవ్ చేశాడు. అంతేకాదు అమెపై అఘాయిత్యం చేసేందుకు కూడా తీవ్రంగా యత్నించాడు. చివరకు తమ గమ్యస్థానం రావడతో మహిళ దిగిపోయింది. అయితే ఈ ఘటన ఆ మార్గంలో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో జరిగింది.

ఆ బస్సులో వున్న సీసీ కెమెరాలో బీజేపి నేతలో వున్న కామాంధుడ్ని.. అతను తన సీటులో పక్కన కూర్చున మహిళపై చేసిన లైంగిక వేధింపులను రికార్డు చేసింది. ఈ వీడియో చూసిన కొందరు ప్రైవేట్ బస్సు సిబ్బంది.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పని చేసింది స్వయంగా గడ్చిరోలి జిల్లా బీజేపీ లీడర్ రవీంద్ర బవంతాడే అని వెలుగులోకి రావడంతో.. ఇప్పుడు రాష్ట్రంలోని బీజేపి సర్కార్ షేక్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అప్పటి వరకు వాళ్లిద్దరి మధ్య గుట్టుగా సాగుతున్న ఈ విషయం కాస్తా.. వీడియో లీక్ కాగానే సదరు మహిళ పోలీసులకు పిర్యాదు చేసింది.

కదులుతున్న బస్సులోనే తనను లైంగికంగా వేధించాడని, ముద్దులు పెట్టాడని, బలవంతం చేయబోయాడని, అదేమంటే తాను జిల్లా బీజేపి నేతనన్న విషయం గుర్తుందిగా అని బెదిరింపులకు పాల్పడ్డాడని తన పిర్యాదులో పేర్కోంది. అయితే తనను పెళ్లి చేసుకుంటానని.. ఉద్యోగం కూడా ఇప్పిస్తానని నమ్మబలికాడని కూడా బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. మా ప్రభుత్వమే అధికారంలో ఉందని.. సహకరించకపోతే ఎక్కడా ఉద్యోగం రాకుండా చేస్తానని బెదిరించాడని ఆ మహిళ కన్నీళ్లతో చెబుతోంది. గడ్చిరోలి బీజేపీ లీడర్ రాసలీలలు బయటపడటంతో.. మహారాష్ట్రలో నెటిజన్లు రెచ్చిపోయారు. పవర్ లో ఉంటే ఏమైనా చేస్తారా అంటూ నిలదీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles