Global Terrorist Supported by Kashmiris Only

Syed salahuddin latest interview

Syed Salahuddin, Syed Salahuddin Global Terrorist, Syed Salahuddin Interview, Syed Salahuddin Geo TV Interview, Kashmiris Help Weapons, Kashmiris Help Funding Terrorists, Weapons, Syed Salahuddin Attacks India, Kashmir Separatist

'Global terrorist' Syed Salahuddin boasts to Pakistan TV channel that he 'carried out terror attacks in India'. Says Pak just political support only, Kashmiris funding to Purchase weapons.

పాక్ సపోర్ట్ ఉండి ఉంటేనా...

Posted: 07/04/2017 08:38 AM IST
Syed salahuddin latest interview

పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాది, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ భారత్ పై తన అక్కసును వెల్లగక్కాడు. మొన్న మోదీ అమెరికా పర్యటన సందర్భంగా తనను కలిసేందుకు ముందే ట్రంప్ ఈ అంతర్జాతీయ తీవ్రవాది హిట్ లిస్ట్ లో చేర్చిన విషయం తెలిసింది. ఆపై ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు ఇద్దరూ ప్రతిజ్న బూనీ పాక్ కు హెచ్చరికలు జారీ చేశారు కూడా. దీంతో సలావుద్దీన్ మరోమారు భారత్‌పై తనకున్న ఆగ్రహాన్ని బయటపెట్టాడు.

సోమవారం పాక్ మీడియా జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. భారత్‌పై దాడులు చేస్తాం.. మళ్లీ చేస్తాం అంటూ హెచ్చరించాడు. తమ పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్న వారిని, భారత దళాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న వారిని, చివరకు పాక్ అంశంలో పెదవి విప్పని రాజకీయ నాయకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. ఇక తమకు పాకిస్థాన్ అన్ని రకాలుగా మద్ధతు ఇస్తుందన్న వాదనను సలావుద్దీన్ తోసిపుచ్చాడు. తమ పోరాటానికి కేవలం నైతిక, రాజకీయ మద్దతు మాత్రమే పాక్ ఇస్తోందని తెలిపాడు.

పాకిస్థాన్ కనుక తమకు పూర్తి స్థాయి మద్దతు తెలిపి ఉంటే కశ్మీర్‌ను ఎప్పుడో స్వాధీనం చేసుకుని ఉండేవాళ్లమంటూ ప్రగల్భాలు పలికాడు. తమకు ఆయుధాలు అంతర్జాతీయ మార్కెట్ నుంచే సరఫరా అవుతాయని, ఇందుకు కావాల్సిన నిధులను కశ్మీరీలే సమకూరుస్తున్నారంటూ సంచలన ప్రకటన చేశాడు. భారత్ లో అయిదు సార్లు దాడులు నిర్వహించాం. అయితే 9/11 దాడుల తర్వాత ఉగ్రవాదుల పరిస్థితి మారింది. దీంతో కశ్మీర్ అవతల ఉగ్రదాడులు చేపట్టాలనుకున్నాం. కానీ భారత్ ఇదే అదునుగా భావించి కశ్మీర్ పోరాటాన్ని ఉగ్ర పోరాటంగా పేర్కొనే ప్రమాదముందని ఆగిపోయాం అంటూ తెలిపాడు.

తనపై అమెరికా నిషేధాన్ని ప్రస్తావిస్తూ ట్రంప్ ది ఓ మూర్ఖపు చర్యగా అభివర్ణించాడు. తానే తలుచుకుంటే అమెరికాపై దాడులు చేయటం చాలా సులువైన పనంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు కావాల్సినంత డబ్బు ఇస్తే ఎంతటి అత్యాధునికమైన ఆయుధమైనా సరే తక్షణమే తెచ్చిస్తానని మీడియా ప్రతినిధితో ఇంటర్వ్యూలో పేర్కొనడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Syed Salahuddin  Pakistan  Kashmiris  Weapons  

Other Articles