bride calls off wedding midway as groom returns late from parlour పీటలపై పెళ్లిని వద్దని వెళ్లిపోయిన పెళ్లికూతురు.. ఎందుకో తెలుసా..?

Bride calls off wedding midway as groom returns late from parlour

parlour expense, Vishnupura village, Etah district, Bride refuses to marry, Bridal makeup, Bhim Nagar, Firozabad district, uttar pradesh

bride calls off wedding midway as groom returns late from parlour, in firozabad of uttar pradesh as she suspects his character

పీటలపై పెళ్లిని వద్దని వెళ్లిపోయిన పెళ్లికూతురు.. ఎందుకో తెలుసా..?

Posted: 07/02/2017 03:25 PM IST
Bride calls off wedding midway as groom returns late from parlour

ఒకప్పుడు కట్నకానుకల విషయంలో తగాదాలు వచ్చి పెళ్లిళ్లు ఆగిపోతుండేవి. లేదంగా చివరి క్షణంలో వధువు, లేక వరుడి అంతకుముందే నడిపిన ప్రేమాయణం తాలుకు విషయాలు తెలిసి పెళ్లిళ్లు అగిపోయేవి. కానీ ఇప్పుడు వాటి కంటే అనవసర విషయాల కారణంగానే పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. మొన్నటికి మొన్న పెళ్లి కొడుకు స్నేక్‌ డ్యాన్స్‌ చేస్తున్నాడన్న కారణంగా వధువు పెళ్లాపేసింది. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫెరోజాబాద్‌లో చోటుచేసుకుంది.

అసలేం జరిగిందన్న వివరాల్లోకి వె.. భీం నగర్‌ ప్రాంతానికి చెందిన ఓ 40 ఏళ్ల వ్యక్తిఅదే ప్రాంతానికి చెందిన యువతితో రెండో పెళ్లి నిశ్చయమైంది. అయితే పెళ్లికి కొద్ది గంటల ముందు వరుడు బ్యూటీ పార్లర్‌కి వెళ్లాడు. అక్కడి నుంచి మండపానికి రావడం ఆలస్యమవడంతో వధువు పెళ్లి ఆపేసింది. దాంతో వరుడి కుటుంబీకులు న్యాయం కోసం స్థానిక పంచాయితీ పెద్దల్ని ఆశ్రయించారు. అయినా వారు ఈ విషయంలో ఏమీ చేయలేకపోయారు.

దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కలగజేసుకున్నా వధువు పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పేసింది. వరుడు తనకంటే పెద్దవాడనితనని చేసుకోవడం ఇష్టంలేదని వధువు తేల్చిచెప్పేసింది. కానీ వరుడి వాదన మరోలా ఉంది. తాను బ్యూటీ పార్లర్‌కి వెళ్లినప్పుడు అక్కడ డబ్బులు ఇవ్వడంలో ఆలస్యం జరగడంతో తాను మండపానికి సమయానికిచేరుకోలేకపోయానని అందుకే పెళ్లి ఆగిపోయిందని తెలిపాడు. ఎంత చెప్పినా వధువు ఒప్పుకోకపోవడంతో ఇక తప్పని పరిస్థితుల్లో ఇరు వైపు పెద్దలు పెళ్లి రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles