Spitfire crash fires debris into airshow crowd రెండో ప్రపంచ యుద్దం నాటి విమానం.. పబ్లిక్ గా పల్టీ కొట్టింది

Airshow spectators in france rush to save spitfire pilot after crash

Airshow Crash, Airshow, British Spitfire, France, France airshow, Spitfire, Spitfire Crash, World War II, World war II plane, WWII, Aviation, emergenices, France, World, video viral, viral video

Spectators attending an airshow in France rushed to save a pilot after the Second World War aircraft he was in crashed during takeoff.

ITEMVIDEOS: రెండో ప్రపంచ యుద్దం నాటి విమానం.. పబ్లిక్ గా పల్టీ కొట్టింది

Posted: 06/13/2017 03:29 PM IST
Airshow spectators in france rush to save spitfire pilot after crash

రెండో ప్రపంచ యుద్దంలో తన సత్తాను చాటి శత్రుసేనల వెన్నులో వణుకు పుట్టించిన యుద్ద విమానం.. ఇప్పుడు కూడా గగన వీధుల్లో విహరించగలుగుతుందా..? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయా..? సందేహమే లేదు ఎందకని విహరించదు..? అని అంటారా. మీరు కరెక్టే.. విమానం పాత కాలానిదైనంత మాత్రాన ఇప్పుడు ఎందుకు గాల్లో విహరించదు. అయితే దానిన తప్పనిసరిగా సర్వీసింగ్ చేయిస్తుండాలి. లేకపోతే.. చిన్నపాటి సమస్య తలెత్తినా.. పోయేది మాత్రం మనిషి ప్రాణమే సుమా. ఇప్పడీ విషయం ఎందుకంటారా..?

రెండో ప్రపంచ యుద్దం నాటి యుద్ద విహాంగం.. అప్పట్లో ఎలా శత్రుదేశాలపైకి దూసుకెళ్లింది..? ఎలా శత్రుదేశాల సేనలను వణికించింది..? ఎలా వైరివర్గం సైనికల బలగాలను హతమార్చింది.. విహాంగ శబ్దాం వింటేనే ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగేత్తాల చేసిందన్న విషయాలను తెలుసుకున్న ప్రజలు ఆ నాటి విమానం.. గగనవీధుల్లో అలా తిరిగితే.. చూడాలని అక్కడకు వచ్చిన ప్రజలు ఒక్కసారిగా భయాందోళనతో పరుగులు బెట్టారు. ఎయిర్ షోలో వివిధ రకాల విమాన విన్యాసాలను చూస్తున్న ప్రేక్షకులు ఎందుకు భయంతో పరుగులు తీశారు.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర ఫ్రాన్స్ ప్రాంతంలో 'లాంగుయాన్‌ విలెట్‌ ఎయిర్‌ షో' నిర్వహణలో అపశృతి చోటుచేసుకుంది. వివిధ రకాల విమానాల విన్యాసాలను తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చారు. ఇంతలో తన విన్యాసాన్ని ప్రదర్శించాల్సిన రెండో ప్రపంచ యుద్ధ కాలానికి చెందిన స్పిట్ ఫైర్ యుద్ధ విమానం టేకాఫ్ సమయంలో ఎవరూ ఊహించని విధంగా ముక్కు నేలకు రాసుకుని అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఎయిర్ షో వీక్షణకు వచ్చిన సందర్శకులకు కొద్ది దూరంలో ఈ విమానం బోల్తా పడడంతో సందర్శకులు బెంబేలెత్తిపోయారు.

ఎయిర్ షోకు విచ్చేసిన ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో గాయపడిన పైలెట్ ను అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. విమానం ముందు టైరు చెత్తలో కూరుకుపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ఎయిర్ షో నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ ఘటనను సందర్శకులు తమ ఫోటోల్లో బంధించి, సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేయడంతో ఇది వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : airshow  british spitfire  world war 11  crash  france  aviation  viral video  

Other Articles