Murdered girl’s relatives vandalise house of accused ప్రేమోన్మాది ఇంటి ఎదుట ఉద్రిక్తం.. యాదాద్రిలో గౌడ కులస్థుల అందోళన

Murdered girl s relatives vandalise house of accused

Murder, gayathri relatives, gouda sangham, srikanth, Love Proposal, Marriage, lover stabed, girl stabbed to death, girl murdered rejecting love, bhongir, yadadri, yadadri bus stop, yadadri-bhongir, yadagirigutta, telangana, crime

Tension prevailed when the relatives of Gayathri, who was killed by Srikanth for rejecting his love, ransacked the house of the accused at Yadagiripally in Yadadri-Bhongir district.

ప్రేమోన్మాది ఇంటి ఎదుట ఉద్రిక్తం.. యాదాద్రిలో గౌడ కులస్థుల అందోళన

Posted: 06/11/2017 10:28 AM IST
Murdered girl s relatives vandalise house of accused

తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రేమోన్మాది ఘటనతో యాదాద్రి జిల్లా యాదాద్రి పల్లెలోని నిందితుడి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం అలుముకుంది. పెళ్లి సంబంధం కుదరడంతో నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తున్న గాయత్రి అనే యువతిని శ్రీకాంత్ అనే ప్రేమోన్మాది అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హత్య చేయడంతో గాయత్రి బంధువులు నిందితుడి ఇంటి వద్ద అందోళనకు దిగారు. అవేశంతో రగిలిపోతున్న గాయత్రి బంధవులు నిందితుడి ఇంటిలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గాయత్రి తండ్రి సూదగాని సాయిలు.. తాము ఇంట్లో లేని సమయం కోసం ఎదురుచూసిన శ్రీకాంత్ తమ అమ్మాయిని హత్య చేశాడని చెప్పారు. తాము ఇంట్లో ఉంటే మమ్మల్ని కూడా చంపేవాడని, అయితే తాము వుండివుంటూ తమ బిడ్డ అర్థాతరంగా హత్యకు గురైయ్యే అవకాశాన్ని మాత్రం ఇచ్చేవారం కాదన్నారు. ఈ ఘాతుకానికి పాల్పడేందుకు శ్రీకాంత్‌కు అతడి స్నేహితులు సహకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాంత్ తో పాటు అతడి స్నేహితులను కూడా అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశాడు.

యాద్రిద్రి జిల్లా యాదగిరి గుట్ట వద్ద జైగౌడ సంఘం అధ్వర్యంలో గౌడ కులస్థులు అందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రేమ చిచ్చు పచ్చని పల్లెల్లో కూడా అగ్గి రాజేస్తుందని, ఇలాంటి ప్రమోన్మాధుల వల్ల ఎంత మంది అభాగిణులు అసువులు బాయాలని ప్రశ్నించారు. తాను ప్రేమించనని తిరస్కరించినందుకు కూడా దారుణాలకు పాల్పడతారా.. అని వారు నిలదీశారు. వెంటనే నిందితుడ్ని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో గౌడ కులస్థులు చేరుకోవడంతో ట్రాఫిక్ కు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది, అందోళనకారులకు పోలీసులు నచ్చజెప్పి నిందితులను అరెస్టు చేస్తామనడంతో వారు శాంతించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Murder  gayathri relatives  gouda sangham  srikanth  Love Proposal  Marriage  Telangana  crime  

Other Articles