అగ్రరాజ్యం అమెరికాలో జడలు విప్పిన జాతి వివక్ష క్రమంగా అన్ని దేశాలకు విస్తరిస్తుందా..? ఇన్నాళ్లు భారతీయ సంతతి వ్యక్తులు, భారతీయుల మేధస్సును వేనోళ్ల పొగడిన దేశాలు.. ఇప్పడు వివక్షను అక్కున చేర్చకుంటున్నాయా..? అన్న సందేహాలు కలగక తప్పడం లేదు. అమెరికా, అస్ట్రేలియా తరువాత తాజాగా బ్రిటెన్ లోనూ భారతీయులు జాతి విద్వేషానికి గురవుతున్నారు. భారత సంతతి వ్యక్తిపై జరిగిన దారుణ హత్యే ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. అయితే నిందితులను మాత్రం ఇప్పటికే సోలీసులు గుర్తించి పట్టుకోవడంలో విఫలమయ్యారు.
వృత్తి రిత్యా రియల్టర్, బిల్డర్ అయిన నలభై ఐదేళ్ల సత్నామ్ సింగ్ తన స్నేహితుడితో కలసి లండన్ నైరుతి ప్రాంతమైన హేయెస్‌లో గత నెల 3న వాకింగ్ చేస్తుండగా కారులో వచ్చిన ఓ అగంతకుడు వారిని అడ్డగించాడు. కారులోంచి దిగుతూనే చేతిలో బేస్ బాల్ బ్యాట్ పటుకుని.. సత్నామ్ సింగ్ పై విచ్ఛక్షణ లేకుండా కొట్టి పరారయ్యాడు. ఈ దాడిలో తలకు బలమైన గాయాలైన సత్నామ్ సింగ్ ను తన స్నేహితుడు హుటాహుటిన అస్పత్రికి తరలించాడు. కాగా చికిత్స పోందుతున్న సత్నామ్ సింగ్ అరోగ్యం మరింత క్షీణించడంతో..ఈ నెల 23న మరణించాడు.
ఈ ఘటనపై స్కాట్ లాండ్ యార్డు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నా.. అగంతకుడు ముసుగు ధరించి వచ్చాడని దీంతో అతన్ని గుర్తించలేకపోయామని చెబతున్నారు. అయితే సత్నామ్ సింగ్ కుటుంబసభ్యలు నిందితులను పట్టుకోవాలని పోలీసులను డిమాండ్ చేయడంతో.. సత్నామ్ సింగ్ హత్య కేసులో నిందితుడ్ని గుర్తించి.. వారి అచూకీ చెప్పిన వ్యక్తులుకు పది వేల పౌండ్లను (12,870 డాలర్లు. భారతీయ కరెన్సీలో సుమారుగా పది లక్షల రూపాయలు) ఇస్తామని తాజాగా పోలీసులు నజరానా ప్రకటించారు. కాగా, ఇది జాత్యహంకార హత్య కాదని పోలీసులు చెబుతున్నారు. వ్యాపారరంగంలో ప్రత్యర్థులు చేశారా..? లేక మరెవరు ఈ దారుణానికి పాల్పడ్డారన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more