Declare cow national animal, says Rajasthan HC గోవధపై కేంద్రానికి రాజస్థాన్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Make cow the national animal rajasthan hc to centre

Rajasthan high court sensational suggestion, rajasthan high court cow slaughter, rajasthan high court life sentence cow, rajasthan high court cow life sentence, cow slaughter, cow slaughter ban, Rajasthan high court, beef ban, sale of cattle, national animal, cow

The Rajasthan high court asked the government to declare cow as the national animal and ensure life sentence for those who kill the bovine.

గోవధపై కేంద్రానికి రాజస్థాన్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Posted: 05/31/2017 04:40 PM IST
Make cow the national animal rajasthan hc to centre

గోవధతో పాటు గోవుల అమ్మకాలపై కేంద్ర పర్యావరణ శాఖ తీసుకువచ్చిన నూతన గెజిట్ నోటిఫికేషన్ పై హైకొర్టుల మధ్య వున్న భిన్నత్వాన్ని చూపుతున్నాయా..? అంటే అవునన్న సమాధానాలే వ్యక్తం అవుతున్నాయి. కేంద్రం తాజా అదేశాలపై దేశవ్యాప్తంగా సర్వత్రా నిరసనలు వెల్లువెతుత్తున్న క్రమంలో మద్రాసు హైకోర్టు నాలుగు వారాల స్టే విధించింది. ఈ నేపథ్యంలో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులకు పూర్తి భిన్నంగా రాజస్థాన్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

గోవుల విషయంలో కేంద్రం చాలా సీరియస్ గా వ్యవహరించాలని సూచించిన రాజస్థాన్ రాష్ట్రోన్నత న్యాయస్థానం.. ఇందుకు అనుగూణంగా కేంద్రానికి పలు సూచనలు చేసింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్రానికి సిఫారసు చేసింది. అలాంటపుడు ఇక అవుల జోలికి ఎవరూ వెళ్లరని అభిప్రాయపడింది. ఇక ఆవులను వధించే వారికి జీవిత ఖైదు శిక్ష విధించాలని సూచించింది. అంతటితో ఆగని న్యాయస్థానం గోమాంసం విక్రయించేవారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అదేశించింది.

పశువుల వధించకుండా.. వాటి అమ్మకాలు, కొనుగోళ్లు జరగకుండా కేంద్రం తీసుకువచ్చిన పశువధ నిషేధ నోటిఫికేషన్ ను సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం నాలుగు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని మద్రాసు హైకోర్టు మదురై బెంచ్‌కి ఆదేశించింది. ఇప్పటికే పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం ఈ ఆదేశాలను పట్టించుకోమని ప్రకటించింది. వామపక్ష ప్రభుత్వాలు ఉన్న కేరళ, త్రిపుర కూడా అదే బాటలో ప్రయాణిస్తామని తెలిపాయి. పశువధ నిషేధంపై కేంద్రం ఆదేశాలను సవాల్ చేస్తూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు నిర్వహిస్తామని, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించి ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని కేరళ సీఎం పినరయి విజయన్‌ స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles