Pinarayi condemns attack on IIT-M scholar విద్యార్థి సంఘాల దాడిని ఖండించిన సీఎం

Kerala cm pinarayi vijayan condemns attack on iit madras student over beef fest

iit madras, Beef Fest, ban on sale of cattle, IIT-Madras PhD scholar, Suraj, India, Kerala chief minister, Pinarayi Vijayan, Tamil Nadu

Kerala chief minister Pinarayi Vijayan condemned the attack on an IIT-Madras PhD scholar, hailing from Kerala, allegedly by some students protesting against a "beef fest" held on the campus, saying it was unfortunate.

విద్యార్థి సంఘాల దాడిని ఖండించిన సీఎం

Posted: 05/31/2017 01:15 PM IST
Kerala cm pinarayi vijayan condemns attack on iit madras student over beef fest

కేంద్రంలో బీజేపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వారికి అనుబంధగా వున్న విద్యార్థి సంఘాలు పేట్రేగిపోతున్నాయి. కేంద్ర మానవ వనరులు శాఖ పరోక్షంగా వారికి మద్దతును తెలపడంతో.. ఏకంగా సరస్వతి నిలయాలను యుద్దభూములుగా మార్చేస్తున్నాయి. ఇక ఆయా విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా వారిపై చర్యలు తీసుకోవాలంటే దడుస్తున్నాయి. కేంద్రంలో తీసుకోచ్చిన పశువధ గెజిట్ నోటిఫికేషన్ పై నాలుగు వారాల స్టే విధిస్తూ మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా.. బీజేపి అనుబంధ విద్యార్థి సంఘం మాత్రం దౌర్జన్యాలకు దిగుతూ.. దాడులకు పాల్పడుతుంది.

బీజేపి అనుబంధ విద్యార్థి సంఘం దాడులను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఖండించారు. దాడి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్ధులు బలవంతంగా బీఫ్ తినని వారి చేత బీఫ్ తినిపిస్తే తప్పని.. కానీ తినేవారికి మాత్రమే పార్టీ ఇస్తే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. మన రాజ్యంగం మనకు ఏది కావాలంటే అది తినే స్వేచ్ఛను ఇచ్చిందని అన్నారు. దానిని కాదని అనడం.. దాడులు చేయడం రాజ్యంగ ఉల్లంఘనకు పాల్పడమేనని అన్నారు. పశువధపై కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ను తమ రాష్ట్రంలో అమలు పర్చబోమని ఆయన ఇప్పటికే తేల్చిచెప్పారు. అయితే ఇదే బాటలో పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వున్నాయి. కాగా సూరజ్ పై దాడి చేిసన వారిని ఎ్టటి పరిస్థితుల్లో వదలకూడదని వారిని విద్యార్థులుగా పరిగణించకూడదని కూడా కోరారు.

కాగా, మద్రాస్‌–ఐఐటీలో బీఫ్‌ విందు ఏర్పాటు చేసిన విద్యార్థిపై కొందరు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశువధ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ 80 మంది విద్యార్థులు ఆదివారం రాత్రి బీఫ్‌ బిరియాని తిన్నారు. ఐఐటీలో పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థి సూరజ్‌ ఈ విందు ఏర్పాటు చేసినట్లు తెలుసుకున్న ఐఐటీలోని మరో వర్గం అతనిపై సోమవారం దాడి చేసింది. అతడ్ని తీవ్రంగా గాయపర్చింది. బీజేపి అనుబంధ విద్యార్థి సంఘం దాడిలో గాయాలపాలైన సూరజ్ తన కంటి చూపును కూడా కోల్పోయాడని తెలుస్తుంది. ప్రస్తుతం అతడ్ని స్థానికంగా గల ఆస్పత్రిలో చేర్పించిన ఐఐటీ అధికారులు చికిత్సను అందిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని మద్రాస్‌–ఐఐటీ అధికార ప్రతినిధి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IIT-Madras  Beef Fest  Pinarayi Vijayan  ban on sale of cattle  Suraj  

Other Articles