Neighbour, minors rape 14-year-old in bengaluru మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితుల్లో ఇద్దరు మైనర్లే..

Neighbour minors rape 14 year old in bengaluru

crime against women, minor girl gangraped, minors gangraped girl, gangrape, sexual harrassment, minor gilr raped by minors, rape, gang rape, minor girl, minor boys, bangalore, Namma Bengaluru, karnataka, crime

A 14-year-old girl was gang raped by three youths, including two minors, in the city’s north division. The accused apparently used the victim’s weakness for chaat.

మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితుల్లో ఇద్దరు మైనర్లే..

Posted: 05/27/2017 12:49 PM IST
Neighbour minors rape 14 year old in bengaluru

మొక్కై వంగనిది మ్రానే వంగునా అన్నట్లు.. చిన్నప్పట్నించే మన పిల్లలు ఏం చేస్తున్నారు..? ఎం చూస్తున్నారు..? అన్న విషయాలపై తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతుండాలి. పిల్లల చేతిలోకి ప్రపంచాన్ని(మొబైల్ ఫోన్ల) అందించడంలో చూపుతున్న అసక్తి.. వారు అందులో ఏం చేస్తున్నారన్న విషయాలను కూడా గమనిస్తూ వుండాలి. దీంతో పాటు పోరుగింటి పిల్లలను గ్రామాల్లో పిలిచినట్లుగా వరుసలు పెట్టి పలిపించాలి. లేదంటే అనర్థాలు జరిగిపోతాయి. చిన్నపిల్లలే కదా అని వదిలేస్తే.. వారు మారుతున్న సమాజంలో నేరప్రవృత్తి వైపు త్వరగా అకర్షితులవుతారు.

అచ్చంగా అలాంటి ఘటనే బెంగుళూరులో జరిగింది. పొరుగింటి బాలికను మాయమాటలు చెప్పి తీసుకుళ్లిన మైనర్ బాలుడు.. ఆ బాలికపై అత్యాచార చేసి.. తన ఇద్దరు స్నేహితుల చేత కూడా అత్యాచారం చేయించాడు. బాలికపై ముగ్గురు మైనర్‌ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన బెంగళూరు నగరంలో సంచలనంగా మారింది. ఈ ఘటన వారం రోజల క్రితం జరుగుగా ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పీణ్యాకు చెందిన ఓ 15 ఏళ్ల బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది.

పొరుగింటికి చెందిన బాలుడే కాబట్టి బాలిక కూడా అతనితో చనువుగా వుండేది. దీంతో అతను నిత్యం పాఠశాల వద్దకు వెళ్లి బాలికను కలిసేవాడు. పాఠశాల ముగిసిన అనంతరం బాలికను హోటల్‌కు, ఇతర స్ధలాలకు తీసుకెళ్లి సరదాగా తిప్పేవాడు. పాఠశాలకు వేసవి సెలవులు కావడంతో ఈ నెల 8న బాలికను నమ్మించి సినిమాకు తీసుకెళ్లాడు. సినిమా చూసిన అనంతరం బాలికను పీణ్యాలో నిర్మాణదశలో ఉన్న ఓ కట్టడం వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి ఒడికట్టాడు. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం అతని ఇద్దరు స్నేహితులు కూడా అక్కడకు చేరుకుని బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

తల్లిదండ్రులు ఎవరితోనూ చనువుగా తిరగవద్దని వారిస్తున్నా.. తాను పొరిగింటి బాలుడితో తిరిగి.. అఘాయిత్యానికి గురయ్యానని, ఈ  విషయం తెలిస్తే తన తల్లిదండ్రులు మందలిస్తారని భయపడి స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. తన కూతురు కనపించడం లేదని బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు పిర్యాదు చేశారు,  తన కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారని అందోళన చెందారు. విషయం తెలుసుకున్న బాలిక ఇంటికి చేరుకుని తల్లికి జరిగిన అఘాయిత్యాన్ని తెలిపింది.

దిగ్భ్రాంతికి గురైన తల్లి మళ్లీ పీణ్యా పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలు తెలిపిన వివరాల మేరకు ముగ్గురు మైనర్‌ బాలురును అరెస్ట్‌ చేసి బాలల పరివర్తనా కేంద్రానికి తరలించారు. అయతే బాధిత బాలిక తరపున ముందుకొచ్చిన పలు సంఘాలు సదరు నిందితులకు బాలల పరివర్తనా కేంద్రానికి తరలించడం బదులు వారిలోని నేరప్రవృత్తి తారస్థాయిలో వున్నందున్న రిమాండ్ కు తరలించాలని డిమాండ్ చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  gang rape  minor girl  minor boys  bangalore  Namma Bengaluru  karnataka  crime  

Other Articles