Petrol price to come under Rs 30 భారీగా తగ్గనున్న పెట్రోల్ ధర.. లీటరు రూ.30

Petrol prices could go as low as rs 30 in another five years

American futurist Tony Seba, petrol for 30 Rs a liter, Indian citizens self driving cars, indian taxi services cheaper, Tony Seba, Silicon Valley Entrepreneur, American futurist, Petrol Prices, India, Oil, Crude Prices, World, Trending

According to an American futurist named Tony Seba, Indian citizens could purchase petrol for 30 Rs a liter in next 5 years

భారీగా తగ్గనున్న పెట్రోల్ ధర.. లీటరు రూ.30

Posted: 05/26/2017 05:13 PM IST
Petrol prices could go as low as rs 30 in another five years

రానున్న ఐదేళ్ల కాలంలో పెట్రోల్.. డీజిల్ ధరలు భారీగా తగ్గుతాయన్న వార్త భారతదేశంలో సంచలనంగా మారింది. భారీగా తగ్గడం అంటే ఇప్పుడున్న ధరలకు ఏకంగా సగానికి పైగా తగ్గుతాయని అంచానాలు వెలువడటంతో ఔరా ఇది నిజమేనా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇవి కేవలం గాలి వార్తలా..? లేక నిజమైన అంచనాలా..? అన్న డౌట్స్ కూడా ఉత్పన్నం అవుతున్నాయి. ఇక కరెక్టుగా చెప్పాలంటే రానున్న ఐదేళ్ల తరువాత ఇంధన ధరలు ఏకంగా రూ.30 కిందకు వస్తాయన్న అంచానాలు వాహనదారులను విస్మయానికి గురిచేస్తున్నాయి.

అయితే ఇది ఏ రాజకీయ నాయకులో ఇచ్చిన విశ్లేషణ కాదు. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఫ్యూచరిస్టు, సిలికాన్ వ్యాలీ వ్యాపారవేత్త అధ్యయనం చేసి మరీ చెబుతున్న మాట. ఆయన మరెవరో కాదు భవిష్యత్తులో అంతా సోలార్ విద్యుత్ వైపే పయనిస్తారని గతకోన్నేళ్ల క్రితం చెప్పిన ఎంటర్ ప్రెన్యూర్ టోనీ సెబా. ఆయన తాజా అధ్యయనం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గుతాయని చెప్పారు. ఇందుకు ఆయ పలు కారణాలను కూడా తెలిపారు.

పెరుగుతున్న సాంకేతికత పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్.. డీజిల్ మీద ఆధారపడటం తగ్గిపోతుందని.. ప్రస్తుతానికి చమురుతో నడిచే వాహనాలు ఉన్నప్పటకీ రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం భారీగా పెరగుతుందని.. ఫలితంగా ముడిచమురు డిమాండ్ భారీగా తగ్గి బ్యారెల్ పాతిక డాలర్ల కంటే దిగువకు పడిపోవటం ఖాయమంటున్నారు. 2020-21 నాటికి చమురు డిమాండ్ వంద మిలియన్ బ్యారెళ్లకు.. తర్వాతి ఐదేళ్లకు 70 మిలియన్ బ్యారెళ్లకు పడిపోతుందని.. ఆయన తన విశ్లేషించారు.

ఇక అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలు తక్కువ ధరకు దొరుకుతాయని.. వాటి నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండటంతో అందరూ ఎలక్ట్రిక్ వాహనాల్ని వినియోగిస్తుంటారని విశ్లేషించారు. పెరిగే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం.. చమురు పరిశ్రమను భారీగా దెబ్బ తీస్తుందని పేర్కొన్నారు. ఇక దీనికి తోడు మారుతున్న భారతీయ యువత అలోచనలను అధ్యయనం చేసిన ఆయన రానున్న తరం వారు సొంత కార్లను నడపడం కన్నా టాక్సీలకు అధిక ప్రాధాన్యమిస్తారని అన్నారు.

దీంతో రానున్న ఐదేళ్ల తరువాత భారత్ లో రవాణ రంగం భారీగా పుంజుకుంటుందని, ఉబర్, ఓలా వంటి టాక్సీ సంస్థలతో పాటు కొత్త సంస్థలు కూడా పుట్టుకువస్తాయని అన్నారు. దీంతో టాక్సీల ప్రయాణధరలు కూడా గణనీయగా పడిపోతాయని చెప్పారు. ఇక సెల్ప్ డ్రైవింగ్ కారులో ప్రయాణించే బదులు అందరూ టాక్సీలో ప్రయాణానికే మొగ్గుచూసుతారని చెప్పారు. అయితే టాక్సీలు కూడా చమురు ఇందనంతో నడిచేవే అయినా.. వాటిలో కూడా ప్రత్యామ్నాయ ఇంధనం వాడే వాహనాలు మార్పులు తీసుకువస్తాయని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles