man murdered in kadapa produtur in broad daylight పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య.. కోర్టుకు కూతవేటు దూరంలోనే..

Man murdered in cuddapah produtur in broad daylight

incident in poduturu kadapa, man smashed with knifes on main road, maruthy reddy smashed by unknown persons, man expired in kadapa, serioulsy smashed by unknown culprits, murder, broad daylight, kadapa, cuddapah, produttur court, devagudi, jammalamadugu, illicit affair, crime

A man murdered in cuddapah district near the vicinity of produtur court in broad daylight, The deceased is known as maruti prasad reddy belongs to jammalamadugu

ITEMVIDEOS: పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య.. కోర్టుకు కూతవేటు దూరంలోనే..

Posted: 05/25/2017 12:38 PM IST
Man murdered in cuddapah produtur in broad daylight

కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని పొద్దుటూరులో అక్రమ సంబంధం అరోపణలతో ఓ నిండు ప్రాణాన్ని తీశారు దుండగులు. పట్టపగలు పొద్దుటూరు కోర్టుకు కూతవేటు దూరంలో మారుతీ ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తిని దారుణంగా నరికి చంపారు. కోర్టుకు హాజరైయ్యేందుకు వస్తున్న వ్యక్తిని దారుణాంగా నడిరోడ్డుపై నరికి చంపేశారు. అగంతకులు అకస్మికంగా జరిపిన దాడిలో అప్పటికే ప్రాణాలు కోల్పోయినా.. అగంతకులు మాత్రం అతడిని పూర్తిగా చనిపోయాడని నిర్ధారించుకునే వరకు కత్తితో వేటు వేస్తునేవున్నారు.

ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికులు ఈ ఘటనను తమ సెల్ ఫోన్ లలో బంధిస్తున్నారని తెలిసినా.. దుండగులు మాత్రం తమ పని తమది అన్నట్లు వ్యవహరించారు. పొద్దుటూరుకు చెందిన మారుతీ ప్రసాద్ రెడ్డి కుటుంబంలోని మహిళతో అక్రమ సంబంధం విషయంలో నలుగురు వ్యక్తులతో వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు వర్గాలు కోర్టు వాయిదాలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో కోర్టు వాయిదా కోసం వచ్చే మారుతీ ప్రసాద్ రెడ్డిని హతమార్చాలని ముందస్తు ప్రణాళికను వేసుకున్నారు.

ప్రత్యర్థుల ప్రణాళిక తెలియని మారుతిప్రసాద్ రెడ్డి కోర్టుకు హాజరవుతున్న క్రమంలో ఆయనతో నలుగురు ప్రత్యర్థులు అడ్డుకుని ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో ఆ నలుగురూ మారుతీ ప్రసాద్ రెడ్డిని కత్తులతో పొడిచారు. వారి నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేసిన మారుతీ ప్రసాద్ రెడ్డిని వెంబడించి, నడి రోడ్డు మీద పట్టపగలు, పది గంటల ప్రాంతంలో అత్యంత పాశవికంగా...విచక్షణారహితంగా గొడ్డును చంపినట్టు అందరూ చూస్తుండగా నరికి చంపారు. మృతుడిది జమ్మలమడుగు మండలం దేవగుడికి అని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : murder  broad daylight  kadapa  cuddapah  produttur court  devagudi  jammalamadugu  illicit affair  crime  

Other Articles