Pawan Questioned AP Government on Injustice at TTD

Pawan kalyan tweet on ttd eo controversy

Jana Sena President Pawan Kalyan, Pawan kalyan, Pawan Kalyan TTD EO, TTD Pawan kalyan, TTD EO North IAS, North South IAS, Pawan Kalyan North South IAS, IAS AK Singhal, AK Singhal New TTD EO, Injustice at TTD, Pawan Chandrababu Naidu TTD EO, North IAS Pawan Tweet, IAS Pawan Kalyan Tweet, TTD EO Controversy, Pawan kalyan Twitter

Jana Sena President Pawan Kalyan objected to Andhra Pradesh Government appointing AK Singhal, an IAS officer from North as the Executive Officer of Tirumala Tirupati Devasthanam.

టీడీడీ కొత్త ఈవో వివాదం.. పవన్ ట్వీట్

Posted: 05/08/2017 11:36 AM IST
Pawan kalyan tweet on ttd eo controversy

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్ ను ఏపీ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ నియామకానికి సంబంధించి దక్షణాది రాష్ట్రాల ఐఏఎస్ అధికారులు అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఉండి సిద్దాంతాలను అనుసరిస్తూ అందుకోసం గళం విప్పుతున్న పవన్ కీలకమైన విషయంలో సైలెంట్ గా ఉండిపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందని ఓ ఐఏఎస్ అధికారి తెలిపాడు. ఉత్తరాది, దక్షిణాది అంటూ ప్రాంతీయ భేదాలపై ట్వీట్లు చేసే పవన్ ఈ విషయంలో ఇంతవరకు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని చెప్పాడు.

దీంతో జనసేనాని స్పందించాడు. కాసేపటి క్రితం తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ ను ఉంచాడు. ఉత్తరాది ఐఏఎస్ లకు తానే మాత్రం వ్యతిరేకం కాదన్న పవన్ టీటీడీ బాధ్యతలను వాళ్లకు అప్పగించటానికి కూడా తాను అభ్యంతరం చెప్పనంటూ తెలిపాడు. అయితే దక్షిణ భారత దేశానికి చెందిన ఓ ఐఏఎస్ ను అమరనాథ్, వారణాసి, మధుర లాంటి పుణ్యక్షేత్రాలకు అధికారులుగా నియమించే సాహసం చేస్తారా? అంటూ ప్రశ్నించాడు. అలాంటప్పుడు దక్షిణ బారతీయులుగా మనం ఇలాంటి నియామకాలను అంగీకరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు.

ఈ విషయంలో అధికార పక్షం టీడీపీ, గౌరవనీయులైన ముఖ్యమంత్రి నిర్ణయం ఆశ్చర్యం కలిగించిందని, ఏపీ, దక్షిణాది ప్రజలకు వాళ్లు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పవన్ అభిప్రాయ వ్యక్తం చేశాడు. ఇంతకు ముందు తెలుగువారికి జరుగుతున్న అన్యాయంపై అవసరమైతే కోర్టుకు వెళతానని స్వామి స్వరూపానంద సరస్వతి ప్రకటించిన విషయం తెలిసిందే.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TTD  Pawan Kalyan  New EO  North IAS  

Other Articles