సాఫ్ట్ వేర్ ఇంజనీర్లలో 95 శాతం అనర్హులా..? 95% engineers in India unfit for software development jobs

Indian engineering students unfit for software development jobs study

iit, jobs, how to do coding, engineering, coding, programming, study engineering, software development, programming jobs, jobs, engineer jobs, it education, learn coding, learn programming, education news, iitians

A study found that 95 per cent of engineers in India are unfit to take up software development jobs.

సాఫ్ట్ వేర్ ఇంజనీర్లలో 95 శాతం అనర్హులా..?

Posted: 04/20/2017 08:19 PM IST
Indian engineering students unfit for software development jobs study

భారత ఐటీ రంగ నిఫుణులు వారి ప్రతిభాపాటవాలను దేశంతో పాటు విదేశాలలో కూడా నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్న క్రమంలో దేశంలోని ఐటీ రంగ ఇంజనీర్లలో నైపుణ్యమున్న వారు కరువయ్యారని వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. దేశవిదేశాలలో మనవారు అక్కడి దిగ్గజాలతో పోటీ పడుతూ మరీ విజయాపరంపరను అందుకుంటున్న తరుణంలో ఐటీ పరిశ్రమను ప్రతిభావంతుల కొరత వేధిస్తోందని ఓ సర్వేలో వెల్లడించడం సంచలనంగా మారింది.

అంతేకాదు ఐటీ రంగంలో ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్న వారిలో 95శాతం మంది సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఉద్యోగాలకు అర్హులుగా కూడా నిలవరని సర్వే పేర్కొంది. ఉపాధి అంచనా సంస్థ ఆస్పైరింగ్ మైండ్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. ప్రోగ్రామింగ్‌ ఉద్యోగానికి కనీస అర్హత ప్రోగ్రాం రాయడం. అయితే కేవలం 4.77శాతం మంది మాత్రమే సరైన లాజిక్‌తో ప్రోగ్రాం రాస్తున్నారు. మిగిలిన వారు రాస్తున్న లాజిక్ మిస్ అవుతున్నారని పేర్కోంది. 500 కళాశాలల్లో 36వేల మంది ఐటీ సంబంధిత బ్రాంచ్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థులపై ఆస్పైరింగ్ మైండ్స్‌ అధ్యయనం చేసింది. వారిలో మూడింట రెండొంతుల మంది సరిగ్గా కంపైల్‌ చేసే కోడ్‌ను రాయలేకపోతున్నారని ఈ సర్వేలో తేలింది.

కేవలం 1.4శాతం మంది మాత్రమే ఎగ్జిక్యూట్‌ చేయగలిగే ప్రోగ్రాం రాయగలుగుతున్నారని వివరించింది. ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలను అందిపుచ్చుకోవడంలో మనవాళ్లు వెనకబడ్డారని, దీంతో ఐటీ, డేటా సైన్స్‌ ఎకోసిస్టమ్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కోంది. ప్రోగ్రామింగ్‌ విషయంలో ప్రపంచంతో పాటు మనమూ పయనించడం లేదని, ప్రపంచం మూడేళ్ల ముందుకు వెళ్లిపోగా, దానిని అందిపుచ్చుకోవాల్సిన అవసరం మనవాళ్లపై నుందని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : software engineers  techies  machine learning  engineers  coding  iitians  study  

Other Articles