తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడి.. Telangana inermiediate results declared

Telangana inermiediate 1st and 2nd year results declared

telangana inter results, ts inter results, intermediate results 2017, ts inter results 2017, intermeidate 1st year results 2017, intermeidate 2nd year results 2017, tsbie 2017 results, results. bie telangana results, tsbie, tsbie results 2017, telangana intermediate results 2017, education news, telangana news

Telangana Dy. CM and Education minister kadiyam srihari has released the Telangana State Inter First and Second Year General and Vocational Results 2017

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయోచ్..!

Posted: 04/16/2017 10:21 AM IST
Telangana inermiediate 1st and 2nd year results declared

తెలంగాణ ఇంటర్మీడియెట్‌ మొదటి, రెండో సంవత్సరం జనరల్, వొకేషనల్‌ కోర్సుల ఫలితాలు వెలువడ్డాయి. ఆదివారం ఉదయం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి  ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాల్లో 57 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. సెకండియర్‌ ఫలితాల్లో 66.4 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గతంతో పోలిస్తే ప్రభుత్వ కాలేజీల ఫలితాలు మెరుగయ్యాయని డిప్యూటీ సీఎం వెల్లడించారు.

ఫస్టియర్‌లో పరీక్షకు 4,75,874 మంది విద్యార్థులు హాజరుకాగా.. 2,70,738 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌ పరీక్షకు 4,18,213 మంది విద్యార్థులు హాజరుకాగా.. 2,75,273 మంది ఉత్తీర్ణలయ్యారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఉత్తీర్ణులైన వారిలో ఇంటర్‌ ఫస్టియర్‌లో 50 శాతం మంది విద్యార్థులు 'ఏ' గ్రేడ్‌ సాధించగా.. సెకండియర్‌లో 53 శాతం మంది విద్యార్థులకు 'ఏ' గ్రేడ్‌ వచ్చిందన్నారు.

ఇక జిల్లాల వారిగా పరిశీలిస్తే.. ఇంటర్‌ ఫస్టియర్‌లో టాప్‌లో మేడ్చల్‌ జిల్లా నిలవగా.. రెండో స్థానంలో రంగారెడ్డి నిలిచింది. చివరిస్థానంలో మహబూబాబాద్‌ నిలిచింది. ఇంటర్‌ సెకండియర్‌లోనూ మేడ్చల్‌ జిల్లా టాప్‌లో నిలవగా.. రెండో స్థానంలో రంగారెడ్డి, చివరిస్థానంలో నిర్మల్‌, గద్వాల్‌, మహబూబాబాద్‌లు నిలిచాయని కడియం శ్రీహరి తెలిపారు. మే 15 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(3 votes)
Tags : telangana  Inter results  kadiyam srihari  intermiediate board  results  

Other Articles