వైరల్ వీడియో,, యువకుడికి గుండు.. కళ్లప్పగించి చూసిన పోలీసులపై వేటు Anti-Romeo squad shaves head of youth, video viral

Anti romeo squad shaves head of youth video viral

anti-romeo, Rajghat police, Mohammad Qasim, inter-religious relationship, Anti-romeo squad

A video of policemen shaving the head of a youth who was in an inter-religious relationship in Shahjahanpur has been widely circulated online.

ITEMVIDEOS: నడిరోడ్డుపై యువకుడికి గుండు.. వీడియో వైరల్

Posted: 04/01/2017 07:23 PM IST
Anti romeo squad shaves head of youth video viral

ఉత్తర్ ప్రదేశ్ లో యువతులను, మహిళలను వేధిస్తున్న రోమియోల అటకట్టించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తూ.. వారికి అధికారులను కూడా అప్పగించిన ఉత్తర్ ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగీ అదిథ్యనాత్.. పలు సూచనలు కూడా చేశారు. అయితే సీఎం అదేశాలతో ఏర్పడిన ఈ బృందాలలో కొందరు తమ ఇష్టానుసారంగా యువకులపై చర్యలు తీసుకుంటున్నారు. గతంలోనే ప్రేమజంటలు, యువజంటల వద్దకు వెళ్లవద్దని సీఎం సూచించినా.. అవి పట్టనట్లు వ్యవహరించారు.

యువతితో సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో ఓ యువకుడికి స్థానికుల సాయంతో యాంటీ రోమియో బృందం గుండు గీయించింది. అయితే యాంటీ రోమియో బృందం ఈ చర్యకు పాల్పడుతున్నా అడ్డుకోకుండా చూస్తూ ఉన్నందుకు ముగ్గురు పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది, వారిని విధుల నుంచి  సస్పెండ్ చేశారు. త‌న‌ స్నేహితురాలిని కలిసేందుకు షాజహాన్‌పూర్‌లోని పబ్లిక్‌ పార్కుకు వచ్చిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని, అనంతరం అత‌డికి ద‌గ్గ‌రుండి గుండు చేయించారు. ముందుగా పార్కులో స్నేహితురాలితో ఉన్న యువకుడి వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ కానిస్టేబుళ్లు, యువతిని అక్కడ నుంచి వెళ్లిపోవాలని చెప్పారు.

అనంతరం ఒక‌ బార్బర్‌ను అక్క‌డ‌కు పిలిపించి యువకుడికి గుండు చేయించారు. ఆ యువ‌కుడికి గుండు కొట్టించిన‌ కానిస్టేబుళ్లు యాంటీ రోమియో స్క్వాడ్‌కు చెందిన సభ్యులు కాదని, ఈ ఘటనపై విచారణ జరపాలని ఉన్న‌తాధికారులు ఆదేశించారు. అయితే, స‌ద‌రు బాధితుడి నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ చ‌ర్య‌కు పాల్ప‌డ్డ‌ కానిస్టేబుళ్లపై మాత్రం చర్యలు తీసుకున్నారు. ఈవ్‌టీజింగ్‌ పేరుతో యువతను ఇబ్బంది పెట్టొందంటూ పోలీసులకు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. యాంటీ రోమియా స్వ్కాడ్ సిబ్బంది మోరల్‌ పోలిసింగ్ పేరుతో ఇలాంటివి చేయవద్దని హెచ్చరికలు జారీచేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles