ఇండియన్ ఉబర్ అర్నబ్ కుమార్ పై లైంగిక కేసు TVF CEO Arunabh Kumar booked for molestation

Tvf ceo arunabh kumar booked for molestation

Arunabh Kumar, TVF CEO Arunabh Kumar, TVF Arunabh Kumar, Arunabh Kumar molestation, The Indian Fowler, Medium blog viral, indian fowler viral, arunabh kumar arrested, arunabh kumar booked, arunabh kumar TVF, TVF founder arunabh kumar, trending, trending news

TVF Founder and CEO Arunabh Kumar has been booked for molestation on the basis of a complaint filed by a victim. A case was lodged against him at the Andheri Police Station

ఇండియన్ ఉబర్ అర్నబ్ కుమార్ పై లైంగిక కేసు

Posted: 03/30/2017 02:57 PM IST
Tvf ceo arunabh kumar booked for molestation

ది వైరల్ వీడియోస్ వ్యవస్థాపకుడు, సీఈఓ అరుణబ్ కుమార్ పై ఎట్టకేలకు పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. అరుణబ్ కు వ్యతిరేకంగా ఓ న్యాయవాది ముందుకురావడంతో.. లైంగికవేధింపుల కేసులో నిందితుడిపై ముంబైలోని అంధేరీ పోలిస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తనకు తానుగా ఇండియన్ ప్లవర్ అని చెప్పుకున్న బాధితురాలు.. ది వైరల్ వీడియోస్ మాజీ ఉద్యోగిని. దీంతో ఎట్టకేలకు తన మాజీ సీఈఓపై లైంగిక వేధింపులపై అమె పిర్యాదు చేయడంతో.. అరుణబ్ కుమార్ పై కేసు నమోదైంది.

అరుణబ్ కుమార్ లైంగిక దాడులకు సంబంధించి ఈ నెల 12న మీడియం బ్లాగులో మాజీ ఉద్యోగిని.. అరుణబ్ లైంగిక దాడులపై ఓ వివరణాత్మకమైన పోస్టును పెడుతూ అమె తన బాధను వ్యక్తపర్చింది. దానిపైై వెనువెంటనే మరికోందరు మాజీ ఉద్యోగినులు కూడా మద్దతు పలుకుతూ తమకు ఆ సంస్థలో వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన అరుణబ్ కుమార్ చేత ఎదురైన దారుణ అనుభవాలను అమె బ్లాగుకు జతపర్చారు. దీంతో ఇది కాస్తా వైరల్ గా మారింది. ఇదిలావుండగా టీవీఎఫ్ సంస్థ తో పాటు అరుణబ్ కుమార్ అవన్నీ సత్యదూరమైన అరోపణలంటూ కోట్టిపారేశారు.

దీనిపై సుప్రీంకోర్టు న్యాయవాది రిజ్వాన్ సిద్దిఖీ మాత్రం అరుణబ్ కుమార్ కు వ్యతిరేకంగా ధర్డ్ పార్టీ పిర్యాదును చేశారు. దీంతో పోలీసులు అరుణబ్ పై కేసును నమోదు చేసి నిందితుడ్ని తన స్టేట్ మెంట్ రికార్డు చేయాల్సిందిగా కోరారు. అయితే బాధితురాళ్లందరూ ఎవరో తెలియకపోవడంతో నిందితుడిపై పోలీసులు ఎలాంటి ఎఫ్ ఐ ఆర్ ను నమోదు చేయలేదు. దీంతో అటు పోలీసులు, ఇటు సుప్రీంకోర్టు న్యాయవాది ఇద్దరు బాధితురాళ్లకు అండగా నిలిస్తామని, పిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andheri Police Station  Arunabh Kumar  India  TVF  

Other Articles