పవన్ కల్యాణ్ ఊరుకు పక్కనుండే మర్రి చెట్టులాంటివాడని అంటానని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. 'ఎందుకంటే, ఊరవతల ఏపుగా పెరిగిన మర్రిచెట్టు ఎండనుంచి, వర్షం నుంచి కాపాడుతుంది.. కనీసం గుర్తింపు కూడా కోరుకోదు.. అదే పవన్ కల్యాణ్' అంటూ త్రివిక్రమ్ విడమరచి చెప్పారు. జనమంతా ఒకడెవడో వస్తాడు అంటూ... అంతా వాడికోసం ఎదురు చూస్తారు...అలా ఎవరైనా తన గురించి మాట్లాడినప్పుడు బాధనిపిస్తుందని... అలా ప్రజల బాధలు తీర్చగలిగే స్థాయి కల్పిస్తే కనుక అంతకంటే ఇంకేమీ వద్దని పవన్ కల్యాణ్ తనతో చాలా సార్లు అన్నారని చెప్పారు.
పవన్ కల్యాణ్ చేసిన మంచిపనులకు తాను ప్రత్యక్ష సాక్షినని ఆయన చెప్పారు. ఒకడు చెయ్యెత్తితే జనం అంతా ఆగిపోయే శక్తి దేవుడు ఒక్కడికే ఇస్తాడు, అలాంటి శక్తి దేవుడు ఎవరికి ఇచ్చాడో అందరికీ తెలుసని అన్నారు. అంతా కలిపి ఇంతే కావచ్చు... కానీ ఒకసారి తలెత్తి చూస్తే ఒక దేశం జెండాకున్న పొగరంత... ఆయన గొంతెత్తితే కొన్ని కోట్ల గొంతుల శబ్దం.. ఆయన సాయం కొన్ని కోట్ల చేతుల సాయం... ఆయన సేవ, మంచితనం ఇలాగే మరింత ముందుకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.
పవన్ కల్యాణ్ ను బాగా ఇష్టపడుతున్న వ్యక్తుల్లో తాను కూడా ఒకడినని టీవీ9 సీఈఓ రవి ప్రకాశ్ తెలిపారు. మొన్నటి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ లా మరొక వ్యక్తి ఎవరైనా కీలక పాత్ర పోషించి ఉంటే... ఫలితాల అనంతరం దానిని మరొక సంపాదనకు అవకాశంగా తీసుకునే వారన్నారు. అయితే పవన్ మాత్రం ఏపీ ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి, విమర్శలు ఎదురవుతున్నా ప్రజల పక్షాన నిలబడ్డారని ప్రశంసించారు. రాజకీయాల్లో సరికొత్త విధానాలకు పవన్ కల్యాణ్ నాంది పలికారని ఆయన చెప్పారు.
నిజం మాట్లాడడం, సత్యం వెనుక నిలబడడం చాలా కష్టమైన విషయమని చెప్పారు. రాష్ట్ర భవిత్యత్ దృష్ట్యా ఏపీకి ప్రత్యేక హోదా, నోట్ల రద్దు వంటి విషయాలపై నిర్భయంగా స్పందించడం ఎవరికైనా ఆదర్శనీయమని అన్నారు. యువత ఆయనలా నిజమైన సమస్యలపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఎన్నికల ముందొక మాట, తరువాత ఒకమాట మాట్లాడే ఈ పరిస్థితి మారాలంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించిన విధానం బాగుందని రవిప్రకాష్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more