సీఎం ఎదుట కన్నీరుమున్నీరైన ఎమ్మెల్యే అభ్యర్థి.. SP candidate into tears in presence of Akhilesh

Pd tiwari of sp breaks down on stage in presence of up cm

PD Tiwari crying, PD Tiwari, UP Elections, Barhaj, Deoria, PM Narendra Modi, UP Elections 2017, Akhilesh Yadav, Uttar Pradesh, Samajwadi Party, BJP, congress

PD Tiwari was immediately taken off the stage by supporters and Akhilesh Yadav who was witnessing the whole incident was left pale faced.

ITEMVIDEOS: బహిరంగసభలో సీఎం ఎదుట కన్నీరుమున్నీరైన ఎమ్మెల్యే అభ్యర్థి..

Posted: 03/03/2017 01:33 PM IST
Pd tiwari of sp breaks down on stage in presence of up cm

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో పార్టీల మధ్య నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న క్రమంలో అభ్యర్థులు మాత్రం తమ వంతుగా విచిత్ర ప్రచారాలకు తెరలేపుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ప్రచార హోరు కొనసాగుతుండగా విచిత్ర, అనూహ్య దృశ్యాలకు తావిస్తున్నాయి. ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో శైలిలో ప్రచారంతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో సమాజ్ వాదీకి చెందిన ఓ ఎమ్మెల్యే అభ్యర్థి తన నియోజకవర్గ ప్రజల ముందు చిన్నపిల్లాడిలా బోరుమని ఏడుస్తూ విచిత్ర ప్రచారం చేసుకున్నారు. అది కూడా తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ సభలో వుండగా, అతని ముందే వెక్కివెక్కి ఏడ్చాడు.

అయితే ఆయన చిన్నపిల్లాడిలా ఏడవడానికి కారణం ఏంటని సభావేదికపైనున్న ఇతర అభ్యర్థులతో పాటు అందరూ అలోచనలో పడ్డారు. కొందరు నాయకులు సదరు ఎస్సీ అభ్యర్థిని సముదాయించారు కూడా. సొంతపార్టీలో తనకు అసమ్మతి ఎదురైన కారణంగా ఆయనకు చేస్తున్న అవమానాలు గుర్తొచ్చి ఏడ్చారని కొందరు భావించగా, అదికాదు మరో కారణం వుంటుందని ఇంకోందరు అన్నారు. అయితే అసలు అయన ఎందుకు వెక్కివెక్కి ఏడ్చారన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. అదే సభలో ప్రసంగిస్తున్న అఖిలేష్ యాదవ్ ప్రసంగిస్తున్న సమయంలోనే అయన ఎడుపు లఖించుకోవడం చర్చకు కూడా దారితీసింది.

ఇక కారణం తెలియడంతో అది ఏడుపు కాదు.. ఆనందబాష్పాలని తెలుసుకున్నారు.. ఉత్తర్ ప్రదేశ్ లోని బార్హాజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో అఖిలేష్ యాదవ్ పర్యటనకు ముందు అక్కడి ప్రధాని నరేంద్రమోడీ పర్యటించారు. యూపీలోని అన్ని అసెంబ్లీ స్తానాలను బీజేపి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు బార్హాజ్ నియోజకవర్గంలో కూడా కమలం వికసిస్తుందని చెప్పారు. దీంతో బార్హాజ్ అసెంబ్లీ నియోజకవర్గ సమాజ్ వాదీ అభ్యర్థి పిడి తివారి అశలు అడియాశలయ్యాయి. సాక్షాత్తు ప్రధానమంత్రి ఇలా చెప్పడంతో.. పార్టీలో వున్న తన అసమ్మతివర్గం కూడా వ్యతిరేకంగా పనిచేస్తారన్న భయం ఆయనలో కనిపించింది.

ఆరో దశలో భాగంగా శనివారం అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ప్రచారానికి తెరపడే చివరి రోజున ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అక్కడికే ప్రచారానికి వచ్చి.. గెలుపుపై పీడీ తివారీకి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమ విశ్వాసాన్ని ఓటు ద్వారా తివారీకి అప్పగించాలని అఖిలేష్ ప్రజలను కోరారు. ఈ ఎన్నికల్లో బీజేపీ సీట్లన్ని కొల్లగొడుతుందని ప్రధాని అన్నారు..  బార్హాజ్‌ సీటును ఎలా కొల్లగొడతారో మనమూ చూద్దామంటూ వ్యాఖ్యానించారు. ఈ మాటలు వినగానే ప్రజల నుంచి పెద్ద ఎత్తున తివారీకి మద్దతుగా చప్పట్లు శబ్దాలు, ఈలలు వినిపించాయి. ఆయన అలా అన్న తర్వాత భావోద్వేగం ఆపుకోలేక అతడు వెక్కివెక్కి ఏడ్చాడు. ఇవి అనందబాష్పాలే అని తెలియడంతో.. సహచర నేతలు అయనకు అప్పుడే శుభాకాంక్షలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles