కాటమరాయుడికి కళ్లు చెదిరే కానుక.. ఎవరిచ్చారో తెలుసా..? who gives katamarayudu gets a powerful surprise gift.?

Katamarayudu gets a powerful surprise gift from whom

katamarayudu, pawan kalyan, actor shiva balaji, director dolly, comedian ali, sword, jana sena sword, janasena slogans, janasena emblem, tollywood

Power Star Pawan Kalyan gets a pleasant surprise on the sets of Katamarayudu. The team Katamarayudu is seen having so much fun on the sets.

ITEMVIDEOS: కాటమరాయుడికి కళ్లు చెదిరే కానుక.. ఎవరిచ్చారో తెలుసా..?

Posted: 02/28/2017 06:02 PM IST
Katamarayudu gets a powerful surprise gift from whom

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అనేక మంది అభిమానులు వున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే యువ హీరోలే ఆయన నటనకు అభిమానులు. అలాంటి యువహీరోల జాబితాలోకి తాజాగా మరో నటుడు చేరిపోయాడు. నితిన్, నికిల్ సరసన హీరో శివబాలజీ కూడా చేరిపోయారు. గతేడాది అక్టోబర్ పదిహేనున శివబాలాజీ జన్మదినాన్ని పురస్కరించుకుని కాటమరాయుడి సెట్ లోనే పెద్ద బ్లాక్ ఫారెస్ట్ కేక్ కట్ చేయించారు పవర్ స్టార్. దాంతో శివబాలజీ కూడా ఆయనకు అభిమానిగా మారిపోయారు.

katama rayudu shiv balaji

అయితే ఇక్కడితో అభిమానం ఫుల్ స్టాప్ పడితే బాగోదనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఏకంగా తనకు పవన్ పై నున్న అభిమానాన్ని కూడా చాటుకోవాలని అనుకున్నాడు. తాను పవన్ కల్యాణ్ వీరాభిమానిని అని చాటుకుని కేవలం మాటలకే పరిమితం కాదల్చుకోలేదు శివబాలజీ. థింక్ ఢిఫరేంట్ అంటూ సమ్ ధింగ్ ఢిఫరెంట్ గా వుండేలా తాను కూడా పవన్ కల్యాన్ కు ఓ చెక్కుచెదరని, నిత్యం గుర్తిండిపోయే బహుమతిని ఇవ్వాలని భావించాడు. అంతే కాటమరాయుడికి కళ్లు చెదిరే కానుకను అందించాడు.

కాటమరాయుడు సినిమాలో పవన్ కల్యాణ్‌కు తమ్ముడిగా నటిస్తున్న శివబాలాజీ, కమేడియన్ పవన్ స్నహితుడు అలీ సమక్షంలో ఈ కానుకను అందించాడు. నిర్మాత శరత్ మరార్, దర్శకుడు డాలీ, ఇలా ఒకరు తరువాత మరోకరు మొత్తంగా చిత్ర యూనిట్ అంతా పవన్‌ను సర్‌ప్రైజ్‌ గిప్టును అందుకున్న అనందాన్ని పుంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడంతో ఇప్పుడది హల్ చల్ చేస్తుంది.

katama rayudu shiv balaji

ఇంతకీ ఆ కానుక ఏంటీ..?

శివబాలాజీ పవన్ కల్యాన్ కోసం ప్రత్యేకంగా ఓ కత్తిని తయారు చేసి బహుమతిగా ఇచ్చారు. జనసేన సింబల్‌తో కూడిన ఈ కత్తిపై జనసేన పార్టీకి సంబంధించిన నినాదాలు లిఖించి తయారు చేయించారు. తమ్ముడి నుండి ఈ బహుమానం అందుకున్న కాటమరాయుడు ఆ కత్తితో సెట్స్ లో సందడి చేసారు. కాటమరాయుడు సెట్స్ లో పవన్ కళ్యాణ్ గారు నాపై చూపిన ఆప్యాయత ఎప్పటికీ మరిచిపోలేను. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయనకు ఏదైనా సర్‌ప్రైజ్ ఇవ్వాలని చాలా కాలం ఆలోచించాను. ఓ ఫైన్ డే... ఆయనకు సరైన సర్‌ప్రైజ్ ఇదే అని ఆలోచన వచ్చింది. అందుకే ఈ కత్తిని తయారు చేయించాం అని శివబాలాజీ తెలిపారు.

ఈ కత్తిని ప్రత్యేకంగా డెహ్రడూన్ లో తయారు చేయించినట్లు శివబాలాజీ తెలిపారు. డిజైన్ కోసం చాలా రోజులు కసరత్తు చేసామని, చివరకు జనసేన పార్టీ సింబల్ తో జనసేనాని కోసం ఈ కత్తి తయారు చేయించామని తెలిపారు. ఈ కత్తిపై జనసేన పార్టీ సింబల్ తో పాటు, పవన్ కళ్యాణ్ రూపం, పార్టీకి సంబంధించిన నినాదాలు లాంటివి చెక్కించారు. చూడటానికి కత్తి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. పవన్ కళ్యాణ్ కు ఆయుధాలంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే ఆయన సినిమాల్లో కూడా తుపాకులు, కత్తులు లాంటి వాటిని ఉపయోగిస్తుంటారని అందుకనే ఈ బహుమతిని ఇవ్వాలని ఎంచుకున్నానని శివబాలాజీ చెప్పారు. కాగా తన మిత్రుడు అలీని కాటమరాయుడు సెట్లో కత్తి చేతపట్టిన పవన్ కళ్యాణ్ ఆటపట్టించారు.

katama rayudu shiv balaji

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles