అర్ధరాత్రి తలుపులు బద్ధలు కొట్టి ఫ్రోఫెసర్ ను ఎక్కడికి తీసుకెళ్లారు? | JAC Chairman Kodandaram arrested at his house.

Jac chairman kodandaram arrested at his house for call nirudhyoga nirasana rally

Professor Kodandaram, Professor Kodandaram Arrest, Kodandaram Telangana Police, Kodandaram Nirudyoga Nirasana Rally, Nirudyoga Nirasana Rally, TJAC Nirudyoga Nirasana Rally, Nirudyoga Nirasana Rally Arrest, Kodandaram Arrest, Telangana DGP Anurag Sharma, Nirudhyoga Nirasana rally Violent, Kodandaram House Arrest, Kodandaram KCR Cases

Police Arrest Professor Kodandaram among TJAC Leaders against Nirudyoga Nirasana Rally.

ITEMVIDEOS:కోదండరాం అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత

Posted: 02/22/2017 07:52 AM IST
Jac chairman kodandaram arrested at his house for call nirudhyoga nirasana rally

నిరుద్యోగుల నిరసన ర్యాలీకి పిలుపు నిచ్చిన తెలంగాణ జేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరాంను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ రోజు తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఇంట్లోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇంటి తలుపులు పగుల గొట్టి మరీ ఆయన్ని బలవంతంగా తరలించారు. కోదండరాంతో పాటు మరో 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, కీలక నేతల అరెస్టు సమాచారంతో రాజధాని సహా రాష్ట్ర మంతటా ఉద్రిక్తత నెలకొన్నట్లయింది. అరెస్టులకు పాల్పడితే ఆయా పోలీస్ స్టేషన్లలోనే శాంతియుతంగా నిరసన తెలుపుతామని జేఏసీ ఇప్పటికే ప్రకటించింది.

ఇక ర్యాలీకి అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ జేఏసీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై నిన్న నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నాగోలులో నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతివ్వబోగా ఆ పిటిషన్ ను జేఏసీ ఉపసంహరించుకుంది. సాయంత్రం కోదండరాం నివాసంలో చర్చించిన జేఏసీ ఇందిరాపార్కు వద్ద నిరసన కార్యక్రమాలను యథాతథంగా శాంతియుతంగా నిర్వహిస్తామని పేర్కొంది. ఈ నిరసన కార్యక్రమానికి పలు విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు హైదరాబాద్ లో మోహరించారు. ర్యాలీలో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు కూడా.

 

హైద‌రాబాద్‌లోని సుంద‌ర‌య్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వ‌ర‌కు శాంతియుత‌ ర్యాలీకి టీజేఏసీ ఛైర్మ‌న్ కోదండ‌రాం పిలుపునిచ్చిన నేప‌థ్యంలో ఆ ర్యాలీకి అనుమ‌తి లేద‌ని, ఎవ‌రూ హైద‌రాబాద్‌కు రావ‌ద్దని డీజీపీ అనురాగ్ శ‌ర్మ సూచించారు. ర్యాలీలో అసాంఘిక శ‌క్తులు చొర‌బ‌డే అవకాశం ఉందని, అందుకే నిరుద్యోగ ర్యాలీకి అనుమ‌తి లేదని అన్నారు. మ‌రోవైపు హైదరాబాద్‌కు అదనపు పోలీస్ బలగాలు చేరుకున్నాయి. ప్ర‌ధానంగా సుందరయ్య విజ్ఞానకేంద్రం, ఇందిరాపార్కు, ఓయూ పరిసరాల దగ్గర పోలీసులను భారీగా మోహరించారు.

ఇప్పుడు నేరగాళ్లం అయ్యామా? : కోదండరాం

ఇక తమపై నేర‌పూరిత‌ కేసులు ఉన్నాయ‌ని, హింస‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు చెబుతున్నారని నిన్న సాయంత్రం మీడియాతో తెలిపిన ప్రొ.కోదండ‌రాం, తెలంగాణ సీఎం కేసీఆర్ కు చురకలు అంటించాడు. తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొన్న నేప‌థ్యంలో కేసీఆర్‌తో పాటు త‌న‌పై 70 కేసుల వ‌ర‌కు ఉన్నాయని, వాటిలో కేసీఆర్ ఏ1, తాను ఏ2గా ఉన్నామ‌న్న విషయాన్ని గుర్తు చేశాడు. సాగ‌ర‌హారం, స‌హాయ‌ నిరాక‌ర‌ణ‌, మిలియ‌న్ మార్చ్ వంటి ఎన్నో కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నామ‌ని, వాటిల్లో పాల్గొన్నందుకే ఇప్పుడు తమను నేర‌గాళ్లు అంటున్నార‌ని కోదండ‌రాం ఆక్షేపించాడు. ఉద్యోగాల క‌ల్ప‌న‌లో తెలంగాణ ప్ర‌భుత్వం ఓ ప్లానింగ్ లేకుండా ముందుకు వెళుతుందన్న ఆయన, ఓ ప్ర‌ణాళిక ప్రకటించి, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించమని మాత్రమే తాము కోరామని తెలిపాడు.

నిజానికి ఫిబ్రవ‌రి 1నే తాము ర్యాలీ నిర్వహణకు ద‌ర‌ఖాస్తు చేసుకున్నామని, ప్ర‌భుత్వంతో కాకుండా, నేరుగా డీసీపీ వ‌ద్ద‌కు వెళ్లి అనుమ‌తి కోరగా ఎలాంటి స్పందన లేదని వివరించాడు. ఆనాటి నుంచే త‌మ‌పై వేధింపులు మొద‌ల‌య్యాయని కోదండ‌రాం తెలిపారు. ప్రభుత్వం తమ హక్కులను కాలరాస్తోందన్న ఆయన ఎట్టి పరిస్థితుల్లో నిరసన కొనసాగుతుందని చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Professor Kodandaram  Nirudhyoga Nirasana Rally  Arrest  

Other Articles