ప్రధాని పదవి హుందాతనం కాపాడండీ సారూ..! aap mp wants pm modi dig records to be removed from parliament

Aap mp wants pm modi dig records to be removed from parliament

Bhagwant Mann, Lok Sabha, Narendra Modi, AAP, Narendra Modi, Parliament, Politics, Bhagwant Mann urges Lok Sabha Speaker to expunge PM's 'derogatory' remark,news, India news,Politics News

AAP MP Bhagwant Mann, who was at the receiving end of the Prime Minister's speech in Lok Sabha, approached the Speaker seeking that the "derogatory" remarks made against him be expunged.

ప్రధాని పదవి హుందాతనం కాపాడండీ సారూ..!

Posted: 02/09/2017 12:08 PM IST
Aap mp wants pm modi dig records to be removed from parliament

పార్లమెంటు లీడర్ గా కోనసాగుతున్న వ్యక్తి నరేంద్రమోడీకి అదే పార్లమెంటులోని సభ్యుల వ్యక్తిగత విషయాలకు సంబంధించి అంశాలను ప్రస్తావించరాదన్న విషయం తెలియకపోవడం విచారకరమని అమ్ అద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మన్ అవేదన వ్యక్తం చేశారు. ప్రధాని తాను చట్టసభలో కాకుండా బహిరంగ సభలో మాట్లాడుతున్నట్లు భావిస్తుంటారని అందుకనే నిత్యం అవతలివారిని చులకన చేయడం, వారిపై వ్యంగ్యస్త్రాలు సంధించడం చేస్తుంటారని దుయ్యబట్టారు.

తొటి పార్లమెంటు సభ్యుడి వ్యక్తిగత విషయాలను సభలో ప్రస్తావించరాదన్న విజ్ఞత కూడా ప్రధాని నరేంద్రమోడీకి లేదని అన్నారు. ప్రధానికి తన మద్యం సేవించడం విషయం అంత అవసరమా అని మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీపై సభాహక్కుల ఉల్లంఘన కింద పిర్యాదు చేస్తానన్నారు.మోదీ తన మర్యాదకు భంగం కలిగేలా మాట్లాడిన ఆ మాటలు వెంటనే రికార్డుల్లోనుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఫిర్యాదు తప్పనిసరిగా చేస్తానని బెదిరించారు.

నలుగురిలో ఉండగానే భగవంత్‌ మన్‌ ఫుల్లుగా మద్యం సేవిస్తారని, పార్లమెంటుకు, బహిరంగ కార్యక్రమాలకు అలాగే వస్తారని గతంలో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. పలుమార్లు ఆయన ఆధారాలతో సహా దొరికిపోయారు. దీంతో ఆయన చాలాకాలం బతకాలంటే కాస్తంత హాయిగా వుండాలి. అందుకు నెయ్యి, పెరుగు లాంటి పదార్థాలు తీసుకోవాలి అని ప్రధాని పార్లమెంటులో ప్రస్తావించారు. దీంతో అసహనంతో బయటకు వచ్చిన మన్.. ప్రధాని నరేంద్రమోడీ ఓ ఉన్నతమైన స్థానంలో వున్న వ్యక్తి అన్న సంగతి మర్చిపోతున్నారని మండిపడ్డారు.

అలాంటి స్థానంలో వున్న వ్యక్తి స్థానానికి వున్న హుందాతనాన్ని పొగ్గొట్టేలా దిగజారి వ్యాఖ్యలు చేస్తారా..? అని ప్రశ్నించారు. సభ గౌరవాన్ని మంటగలిపారని వ్యాఖ్యానించారు. తనకు తాగుడు సమస్యే లేదని, ఇప్పటికిప్పుడు నిజాలు తెలుసుకోవాలంటే కచ్చితంగా ఆల్కామీటర్‌ పరీక్ష జరగాల్సిందేనంటూ ఆవేశంగా అన్నారు. ప్రధాని మాటలను రికార్డుల్లో నుంచి తొలగించకుంటే తాను ఫిర్యాదు తాను ప్రివిలేజ్‌ కమిటీకి వెళతానని భగవంత్ మన్ స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bhagwant Mann  Lok Sabha  Narendra Modi  AAP  'derogatory' remark  politics  

Other Articles