ఆదాయ పన్ను శ్లాబుల్లో మార్పులు చేసిన అర్థికమంత్రి Income Tax rate halved to 5 per cent for Rs 2.5-5 lakh slab

Income tax rate halved to 5 per cent for rs 2 5 5 lakh slab

PM modi, narendra modi, arun jaitley, Income Tax, IT slabs, latest it caps, Budget, finance minister, nda government, budget 2017-18, Union Budget 2017, financial year budget, congress, mallikarjun kharge, parliament

Persons with annual Income upto Rs 3 lakh will not have to pay income tax and those having income upto Rs 5 lakh will be charged income tax at 5 per cent.

ఆదాయ పన్ను శ్లాబుల్లో మార్పులు చేసిన అర్థికమంత్రి

Posted: 02/01/2017 12:59 PM IST
Income tax rate halved to 5 per cent for rs 2 5 5 lakh slab

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఇవాళ లోక్సభలో 2017-18 ఏడాదికిగాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో దిగువ శ్రేణి అదాయ వర్గాలను కరుణించారు. ఆదాయ పన్ను శ్లాబులలో స్వల్ప మార్పులు చేసిన విత్తమంత్రి ఐదు లక్షల రూపాయల లోపు అదాయమున్న వారికి కొంత ఊరటనిచ్చారు. ముఖ్యంగా నిజాయితీగా పన్ను చెల్లిస్తున్న ఉద్యోగులను, వేతన జీవివులను కరుణించిన ఆయన వారు మాత్రమే నిజాయితీగా పన్ను చెల్లిస్తున్నారని.. వారిపైనే అధిక బారం పడుతుందని పేర్కోన్న అయన వారికి ఊరట కల్గించారు.

ఈ క్రమంలో ఆదాయ పన్ను శ్లాబులో మార్పలను చేశారు. గతంలో మూడు లక్షల ఆదాయం వున్నవారిని పూర్తి పన్ను మినహాయింపు కల్పించగా, దానిని కుదించి రెండున్నర లక్షల వరకు తగ్గించారు. దీంతో వ్యక్తిగత వార్షిక అదాయం రూ.2.50 లక్షలు వున్నవారికి పూర్తిగా పన్ను మినహాయింపును కొనసాగించిన కేంద్ర ఆర్థిక మంత్రి ఆ తరువాత రెండున్నర లక్షల ఆదాయం నుంచి ఐదు లక్షల ఆదాయమన్న వర్గానికి 10 శాతంగా వున్న పన్నును 5 శాతానికి తగ్గించారు. కాగా వారిపై వున్న విద్యా సెస్సును మాత్రం యధాతధంగా వుంచడంతో పాటు ఒక్కశాతంగా వున్న ఉన్నత విద్యా సెస్సును కూడా యధాతథంగా కొనసాగించారు.

ఇక 5 నుంచి 10 లక్షల ఆదాయవర్గానికి 20 శాతం అదాయపన్నుతో పాటు రెండు శాతం విద్యా సెస్సు, ఒక్క శాతం ఉన్నత విద్యా సెస్సును యధాతథంగా కొనసాగించారు. పది లక్షలు నుంచి 50 లక్షల అదాయ వర్గానికి కూడా పన్ను చెల్లింపులలో ఎలాంటి మార్పులు చేయలేదు. వారిపై కూడా 2 శాతం విద్యా సెస్సు, ఒక్క శాతం ఉన్నత విద్యా సెస్సును కొనసాగిస్తున్నారు. దీంతో పాటు 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు, కోటి రూపాయ పైన అదాయమున్న వర్గలవారి శ్లాబ్ లో కూడా ఎలాంటి మార్పులను చేపట్టలేదు కేంద్ర అర్థికమంత్రి అరుణ్ జైట్లీ.

బడ్జెట్ హైలెట్స్ ఏంటంటే...

* వార్షిక వ్యయ ప్రణాళిక రూ. 21.47 లక్షల కోట్లు.
* రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ. 4.11 లక్షల కోట్లు.
* రక్షణరంగానికి, పెన్షన్లకు రూ. 2.74,114 కోట్లు.
* శాస్త్ర సాంకేతిక రంగానికి రూ. 34,435 కోట్లు.
* ద్రవ్యలోటు జీడీపీలో 3.2 శాతం.
* వచ్చే ఏడాది ద్రవ్యలోటును 3 శాతానికి పరిమితం చేస్తాం.
* ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణకు ప్రాధాన్యం.
* మార్కెట్ నుంచి రూ. 3.48 లక్షల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యం.
* వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు 1.9 శాతం.
* గత సంవత్సరం 1.81 కోట్ల మంది టాక్స్ రిటర్న్ లు దాఖలు చేశారు.
* వీరిలో పన్ను చెల్లించినది 1.7 కోట్ల మంది.
* రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వార్షికాదాయం ఉన్నవారు 1.95 లక్షల మంది.
* రూ. 10 లక్షల లోపు ఆదాయం చూపిస్తున్న వారి సంఖ్య 20 లక్షలకు పైనే.
* రూ. 2.5 లక్షల వార్షికాదాయం ఉన్నవారు 99 లక్షల మంది.
* నోట్ల రద్దు తరువాత 34 శాతం పెరిగిన రాబడి.
* 24 లక్షల మంది రూ. 10 లక్షలకు పైగా ఆదాయాన్ని చూపుతున్నారు.
* 1.2 లక్షల మంది రూ. 50 లక్షల ఆదాయాన్ని చూపుతున్నారు.
* పది లక్షలు వార్షికాదాయం దాటిన వారు 24 లక్షలైతే, గత సంవత్సరం కోటికి పైగా కార్లు అమ్ముడయ్యాయి.
* ఇండియాలో వేతన జీవులు 4.2 కోట్ల మంది.
* నవ్యాంధ్ర రాజధాని అమరావతికి భూములిచ్చిన వారికి మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు.
* రూ. 50 కోట్ల టర్నోవర్ దాటని కంపెనీలకు ఆదాయపు పన్నులో 25 శాతం ఊరట.
* ఈ నిర్ణయంతో దేశంలోని 96 శాతం కంపెనీలకు లబ్ధి.
* రూ. 5 కోట్ల టర్నోవర్ లోపున్న కంపెనీలకు ఒక శాతం కార్పొరేట్ పన్ను మినహాయింపు.
* నల్లధనం నిరోధానికి కఠిన చర్యలు.
* రూ. 3 లక్షలు దాటే నగదు చెల్లింపులకు అనుమతి లేదు.
* రూ. 3 లక్షలు దాటే చెల్లింపులు చెక్ లేదా ఆన్ లైన్ ద్వారానే జరగాలి.
* రాజకీయ పార్టీలకు విరాళం రూ. 20 వేలు దాటితే తప్పనిసరిగా లెక్క చూపాల్సిందే.
* పార్టీలకు నగదు విరాళం రూ. 2 వేలకు పరిమితం.
* అంతకు మించి ఇవ్వాలంటే చెక్కు లేదా డిజిటల్ రూపంలోనే ఇవ్వాలి.
* అన్ని పొలిటికల్ పార్టీలూ చట్టం ప్రకారం రిటర్నులు దాఖలు చేయాల్సిందే.
* చారిటీ సంస్థలకు ఇచ్చే విరాళాల్లో పన్ను మినహాయింపు రూ. 2000కు తగ్గింపు
* అత్యధికులు పన్ను పరిధిలోకి రావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం.
* నోట్ల రద్దు తరువాత వేతన జీవులపై పన్ను భారం తగ్గించాలని నిర్ణయించాం.
* రూ. 3 లక్షల వరకూ వార్షికాదాయం ఉన్న వారికి పన్ను నుంచి మినహాయింపు.
* ఆపై రూ. 5 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న వారికి ఊరట. పన్ను భారం 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు.
* రూ. 5 లక్షలలోపు ఆదాయముంటే ఏటా రూ. 2,500 పన్ను పడే అవకాశం.
* రూ. 50 లక్షల వార్షికాదాయం ఉన్నవారిపై 10 శాతం సర్ చార్జ్.
* పరోక్ష పన్నుల్లో ఎలాంటి మార్పూ లేదు.
* మిగతా ఆదాయపు పన్ను శ్లాబులు యథాతథం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM modi  arun jaitley  budget 2017-18  financial year budget  Income Tax  parliament  

Other Articles