పార్లమెంట్ లో ఎంపీపై రేప్ అటెంప్ట్ | Pakistani MP Harassed In Parliament.

Pakistani woman lawmaker harassed in parliament

Pakistani MP Harassment, Imdad Pitafi , Nusrat Sahar Abbasi sexual harassment, Pakistan womanMP, Sexual Harassment Parliament, Pakistan Woman MP, AFP news

Pakistani MP Harassed In Parliament, Social Media Fights Her Cause. Pakistani female lawmaker threatened to self-immolate after she was harassed by male colleagues in parliament, telling AFP that the widely-publicised incident shows how laws to protect women are not being enforced. Nusrat Sahar Abbasi, an MP in Sindh province, spoke of her fury after provincial minister Imdad Pitafi invited her to his private chambers on the floor of the assembly on Friday in comments seen as sexual harassment in conservative Pakistan.

పార్లమెంట్ లో మహిళా ఎంపీపై అఘాయిత్యం

Posted: 01/25/2017 01:54 PM IST
Pakistani woman lawmaker harassed in parliament

పార్లమెంట్ సాక్షిగా తనపై లైంగిక వేధింపులు జరిగినప్పటికీ, ఎవరూ పట్టించుకోవట్లేదంటూ ఓ మహిళా మంత్రి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించటం తీవ్ర కలకలం రేపుతోంది. పాకిస్థాన్ లో ఓ ఎంపీని కేంద్ర మంత్రితో అసభ్యకర రీతిలో ప్రవర్తించిన తీరు సంచలనంగా మారింది. దేశంలోని మహిళలకు రక్షణ లేకుండా పోయిందంటూ ఆ దేశ న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్ పీ ఇందుకు సంబంధించి ఓ కథనం ప్రచురించింది.

సింధ్ ప్రోవిన్స్ ఎంపీ నూర్సత్ సహర్ అబ్బాసిని ఇమాద్ పితాఫీ శుక్రవారం తన ఛాంబర్ కు పిలిపించుకుని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఆమె చెబుతోంది. డిప్యూటీ స్పీకర్ కూడా మహిళే అయినప్పటికీ ఈ విషయంలో స్పందన లేకపోవటం దారుణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక ఈ విషయం బయటకు పొక్కిన తరువాత, సోషల్ మీడియాలో నుస్రాత్ కు మద్దతు పెరగగా, నుస్రాత్ ఆరోపణలపై విచారణకు ఆదేశించినట్టు ఫెడరల్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు చేసినప్పటికీ, వాటికి సరిగ్గా అమలు పరచకపోవటం మూలంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. గతేడాది భార్యలను సున్నితంగా మందలించిన అది గృహహింస కిందికే వస్తుందని ఓ చట్టం చేసినప్పటికీ, అది ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు.

పాకిస్థాన్ పార్లమెంటు సాక్షిగా, అది ఓ మహిళా ఎంపీపై ఇంతగా లైంగిక వేధింపులు జరిగినప్పటికీ, మీడియా హైలెట్ చేయకపోవటంపై పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  Woman MP  Sexual Harassment  

Other Articles