న్యూడ్ ఫోటోపై కేంద్రమంత్రిని తప్పుబట్టిన నటి. minister vijay goel and actress zaira wasim, twitter spat

Minister vijay goel and actress zaira wasim twitter spat

zaira wasim, vijay goel, zaira wasim twitter, vijay goel twitter, goel wasim twitter, dangal actor zaira wasim, sports minister vijay goel

Dangal actor Zaira Wasim, was not pleased with a recent tweet of sports minister Vijay Goel.

న్యూడ్ ఫోటోపై కేంద్రమంత్రిని తప్పుబట్టిన నటి.

Posted: 01/20/2017 05:30 PM IST
Minister vijay goel and actress zaira wasim twitter spat

'దంగల్‌' చిత్రం సినీవిశ్లేషకుల అంచనాలను తలదన్నుతూ మునుపెన్నడూ లేని ఇండియన్ సినిమా రికార్డులను బద్దలు కోట్టిన నేపథ్యంలో అందులో వున్న నటీనటులకు మంచి పేరు రావడం.. వారు ఏ చిన్నపోరబాటు చేసినా అది వివాదాస్పదం కావడం కామన్. అయితే ఈ చిత్రంలో బాలనటి జైరా వసీం మాత్రం ఏకంగా కేంద్రమంత్రి విజయ్ గోయల్ కు షాక్ ఇచ్చింది. కట్టుబాట్లు అనేది వేరు.. దూసుకెళ్లడం అన్నది వేరు అన్న చక్కగా ఉదహరించింది. కట్టుబాట్ల మధ్య వున్నంత మాత్రానే స్వేఛ్చాగా లేమన్నది కాదు అని వివరించింది.

దీంతో తన ఉద్దేశ్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేందటూ కేంద్రమంత్రి దిగిరాక తప్పలేదు. వీరిద్దరికీ మధ్య అసలు వివాదం ఎక్కడ రేగింది..? ఎవరు రేకెత్తించారు..? అంటే మాత్రం దానికి అజ్యం పోసింది కేంద్రమంత్రివర్యులే. ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్‌గోయల్‌.. ఆ తరువాత గ్యాలరీలోని బొమ్మలను చూశారు. అయితే ఓ బొమ్మ మాత్రం ఆయన దృష్టిని బాగా అకర్షించింది.

ఇంకేముందు ఆ బొమ్మను ఫోటో తీసుకున్న మంత్రివర్యులు.. దంగల్ సినిమా బాలనటి జైరా వసీంకు అన్వయించారు. పంజరంలో బందీ అయిన ముస్లిం యువతి బొమ్మను ట్విట్టర్‌లో పోస్ట్‌చేసి.. 'ఈ ఫొటో జైరా వసీం పరిస్థితికి అద్దం పట్టేలా ఉంది. మన బాలికలు పంజరాన్ని బద్దలు కొట్టి ముందుకు సాగుతున్నారు..'అని విజయ్‌గోయల్‌ కామెంట్‌ చేశారు. కొద్దిసేపటికే జైరా వసీం మంత్రిగారి పోలికను తప్పుపడుతూ ప్రత్యుత్తరమిచ్చింది.

"సార్‌.. మీరు వర్ణించినట్లు ఈ బొమ్మతో నేనెలా కనెక్ట్‌ అవుతాను? అసలీ బొమ్మకు, నాకు కనీస సారూప్యత కూడా లేదు. అయితే మీకో విషయం చెప్పాలి.. బురఖా వేసుకునేవాళ్లు అందంగానేకాదు.. స్వేచ్ఛగానూ ఉంటారు..' అని జైరా వసీం మంత్రికి బదులిచ్చారు. దీంతో ఖంగుతిన్న మంత్రిగారు తన పోలికను సమర్థించుకుంటూ 'నా ఉద్దేశాన్ని నువ్‌(జైరా) తప్పుగా అర్థం చేసుకున్నావ్‌. నీ పరిధిలో నువ్వు ఎంతో సాధించావ్‌. అలాగే కట్టుబాట్లు, నిబంధనలను తెంచుకుంటూ బాలికలు ఎదగాలని కోరుకుంటున్నా..'అని విజయ్‌గోయల్‌ వ్యాఖ్యానించారు.

'దంగల్‌' సినిమాతో అద్భుతంగా నటించి స్టార్‌డమ్‌ సొంతం చేసుకున్న కశ్మీరీ బాలిక జైరా వసీం.. సీఎం మెహబూబా ముఫ్తీని కలవడంపై వివాదం చెలరేగడం, దానికి ఆమె వివరణ ఇచ్చుకోవడం, ఈ క్రమంలో పలువురు రాజకీ, సినీ ప్రముఖులు జైరాకు మద్దతు పలకండం తెలిసిందే. ముస్లిం బాలిక అయిన జైరాను 'పంజరంలో మహిళ' బొమ్మతో పోల్చడంపై మంత్రి గోయల్‌పైనా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

goel nude paint

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : zaira wasim  vijay goel  twitter spat  nude photo  dangal actor  sports minister  

Other Articles