అర్బీఐ ఎదుట మహిళ నగ్న నిరసన Woman goes topless at RBI gate Delhi

Woman strips outside rbi after being unable to exchange old notes

demonetisation, demonetisation woes, demonetisation blues, woman stripped, exchange old notes, Narendra Modi, note ban, RBI, Reserve Bank of India

Unable to get a few junked currency notes exchanged, a frustrated poor woman became topless in front of RBI regional office in the national capital New Delhi.

ITEMVIDEOS: పెద్దనోట్ల తంటా: అర్బీఐ ఎదుట మహిళ నగ్న నిరసన

Posted: 01/05/2017 06:29 PM IST
Woman strips outside rbi after being unable to exchange old notes

పెద్ద నోట్లు రద్దు నిర్ణయంతో దేశంలోని సామాన్యులు, పేదలకు మాత్రమే శాపంలా పరిణమించిందని, పెద్దలు, నల్లకుబేరులు మాత్రం కూర్చున్న సీటు నుంచి కదలకుండానే కోట్ల రూపాయలను మార్చుకున్నారన్న విమర్శల అరోపణలకు ఇది నిలువుటద్దం. పెద్ద నోట్ల మార్పిడి కోసం గత కొన్ని రోజులుగా పనులు మానుకుని మరీ ఆర్బీఐ ప్రధాన కార్యాలయం చుట్టూ తిరిగిన ఓ పేద మహిళ.. చివరకు చిర్రెత్తుకోచ్చి చేయకూడని పనిచేసింది. రెక్కాడితే కానీ డోక్కాడని పేద మహిళ తన వద్దనున్న నాలుగు వేల రూపాయలను మార్చుకునేందుకు గతంలో వచ్చినా.. పెద్ద సంఖ్యలో జనం వుండటంతో రష్ లేదని తీరిగ్గా వచ్చింది.

అయితే అర్బీఐ అధికారులు మాత్రం అమె ఆశలపై నీళ్లు చల్లారు. నోట్ల మార్పిడి సమయం దాటిపోయిందని, వెళ్లమని చెప్పారు.  దీంతో తీవ్ర ఆగ్రహాన్ని లోనైన మహిళ చుట్టుపక్కలవారు, ఆర్బీఐ అధికారులు అవాక్కయ్యేలా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అధికారుల తీరును నిరసిస్తూ ఆర్బీఐ గేటుముందే అందరూ చూస్తుండగా ఆ మహిళ తన బట్టలు విప్పేసి నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటన ఢిల్లీలోని ఆర్‌బీఐ భవనం ఎదుట చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇళ్లల్లో పనిచేసి కాలం దీసుకుంటున్న ఆ మహిళ నాలుగేళ్ల పాపను తీసుకొని గత రెండు రోజులుగా ఆర్‌బీఐ వద్దకు వస్తోంది.

ఆమె దగ్గరున్న రూ.నాలుగువేల పాత నోట్లను తీసుకొని కొత్త నోట్లను ఇవ్వాలంటూ కోరుతుంది. అయితే, బ్యాంకు అధికారులు మాత్రం నగదు మార్పిడి గడువు నవంబర్‌ 24తోనే ఆఖరు అని, మార్పిడి ఇప్పుడు సాధ్యం కాదంటూ ఆమెకు చెప్పారు. అయినప్పటికీ ఆమె అలాగే క్యూలో నిల్చొని తనకు డబ్బు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడుతోంది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన పోలీసులు ఆమెను బలవంతంగా జీపులోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు.

అయితే, వారి నుంచి విడిపించుకున్న ఆమె అనంతరం ఆర్‌బీఐ గేటు ముందు నిల్చుని అక్కడ క్యూలో ఉన్న జనం, ఎదురుగా పోలీసులు, లోపల సెక్యూరిటీ గార్డులు చూస్తుండగానే తీవ్ర అసహనంతో తన బట్టలు మొత్తం విప్పేసింది. చివరికి ఆమెకు తిరిగి బట్టలు అందించి బ్యాంకు అధికారుల వద్దకు తీసుకెళ్లగా ఆమె వద్ద కనీసం గుర్తింపు కార్డు లేదు. పైగా ఆమె తీసుకొచ్చిన నోట్లు చిరిగిపోయి ఎలుకలు కొరికి ఉన్నాయి. దీంతో ఆమెకు డబ్బు ఇవ్వకుండా, కేసు పెట్టకుండా పోలీసులు విడిచిపెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles