‘‘దళిత వ్యతిరేకికి అవార్డునందించిన ప్రధాని మోడీ’’ Lalu blasts Modi for honouring Appa Rao0

Lalu blasts modi for honouring appa rao0

Rohit Vemula, PM Modi, HCU VC apparao, lalu prasad yadav, facebook, hcu psycology scholar, dalits, bjp

RJD chief Lalu Prasad Yadav took to Facebook to criticise PM Modi for felicitating HCU Vice-Chancellor Prof Appa Rao Podile at the ongoing Indian Science Congress

‘‘ ఆ అవార్డుతో దళితుల పట్ల బీజేపి నైజం బట్టబయలైంది’’

Posted: 01/04/2017 07:45 PM IST
Lalu blasts modi for honouring appa rao0

దళితుల పట్ల ప్రధాని నరేంద్రమోడీ వైఖరి మరోమారు స్పష్టమైందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ అప్పారావుకి ప్రధాని నరేంద్రమోదీ అవార్డు ఇచ్చి సత్కరించడాన్ని తప్పుబట్టిన అయన ప్రధాని ప్రజల ముందు మాట్లాడేది ఒకటి చేతల్లో మాత్రం చేసేది మరోకటని ఎద్దేవా చేశారు. హెచ్ సీ యూ విద్యార్థి, రీసెర్చ్‌ స్కాలర్‌ రోహిత్‌ వేముల ఆత్మహత్యకు కారకుడైనట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్టు చేసి శిక్షించాల్సిందిపోయి, అతడికి అవార్డులిచ్చి ఎలా సత్కరిస్తారని ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

‘రోహిత్‌ వేముల భారతమాత బిడ్డ' అని ఆయన ఆత్మహత్యానంతరం పేర్కొన్న ప్రధాని మోదీ.. ఇప్పుడు రోహిత్‌ మరణానికి కారణమైన వీసీ అప్పారావును తిరుపతిలో జరిగిన సైన్స్‌ కాంగ్రెస్‌లో సత్కరించారని, ఇది పూర్తిగా అక్షేపనీయమని లాలూ ప్రసాద్ యాదవ్ దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన తన ఫేస్‌బుక్‌ పోస్టులో ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. దీంతో దళితుల పట్ల బీజేపికి, ప్రధాని నరేంద్రమోడీకి వున్న వైఖరి బట్టబయలైందని అన్నారు.

హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ విద్యార్థులు కూడా వీసీ అప్పారావుకి అవార్డునివ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎదుర్కొంటున్న వీసీ అప్పారావుకి చంద్రబాబు దగ్గరుండి ప్రధాని మోదీ చేత అవార్డునిప్పించారని విద్యార్థులు ఆరోపించారు. ఈ వీసీ కారణంగానే రోహిత్‌ వివక్ష, వెలివేత ఎదుర్కొన్నారని ఆయనతోపాటు రస్టికేట్‌ అయిన అంబేడ్కర్‌ స్టుడెంట్స్‌ అసోసియేషన్‌ నాయకుడు దొంత ప్రశాంత్‌, విజయ్‌, శేషు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అప్పారావుకి అవార్డు ఇవ్వడం విద్యార్థి ఉద్యమాన్ని అణచివేయడంలో భాగమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rohit Vemula  PM Modi  HCU VC apparao  lalu prasad yadav  facebook  hcu psycology scholar  dalits  bjp  

Other Articles