హంతకురాలు కాస్త సమాజ సేవకిగా మారిపోయింది | Indrani donate her property and organs

Indrani mukherjea shocking decision

Sheena Bora murderer, Indrani Mukherjea, Indrani Mukherjea donates organs, Indrani Mukherjea property, Indrani Mukherjea property and body organs, Sheena Bora Case, Sheena Bora Mother, Sheena Bora, Indrani Mukherjea news

Sheena Bora murderer Indrani Mukherjea wants to donate 75 per cent of her property and body organs.

జైలు జీవితం ఆ హంతకురాలిని బాగా మార్చేసింది

Posted: 12/24/2016 10:20 AM IST
Indrani mukherjea shocking decision

ఆస్తి కోసమే కన్నకూతురిని కడతేర్చిన తల్లి ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. షీనాబోరా హ‌త్య‌కేసు నిందితురాలు ఇంద్రాణియా ముఖ‌ర్జియా తన ఆస్తిని దానం చేయాలని నిర్ణయించింది. అంతేకాదు కోర్టులో తన తరపున న్యాయవాది నుంచి ఓ పిటిషన్ కూడా దాఖలు చేయించింది. దీనికి స్పందించిన న్యాయమూర్తి హెచ్ఎస్ మ‌హాజ‌న్ మాట్లాడుతూ ఆస్తులు విరాళంగా ఇవ్వడానికి కోర్టు అనుమ‌తి అవ‌స‌రం లేద‌ని తెలిపారు.

కుమార్తె హ‌త్య‌కేసులో ప్ర‌ధాన నిందితురాలిగా ఉన్న ఆమె కోర్టు ముందు రెండు విన‌తులు ఉంచారు. త‌న అవ‌య‌వాల‌ను దానం చేయ‌డంతోపాటు ఆస్తిలో 75 శాతం వాటాను విరాళంగా ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు సీబీఐ ప్ర‌త్యేక కోర్టు ముందు తెలిపారు. ఈ సంద‌ర్బంగా ఇంద్రాణియా మాట్లాడుతూ, జైలులో ఖైదీల క‌ష్టాలు చూసి చ‌లించిపోయాన‌ని తెలిపింది. ఈ కేసు నుంచి తాను నిర్దోషిగా బ‌య‌ట‌ప‌డ‌తానో లేక ఉరిశిక్ష ఎదుర్కోవాల్సి వ‌స్తుందో త‌న‌కు తెలియ‌ద‌ని, అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని పేర్కొంది. తాను దానం చేసే ఆస్తిలో స‌గం ఇస్కాన్ సంస్థ‌కు, మిగిలిన దానిని స్త్రీ, బాల‌ల సంక్షేమ సంస్థ‌ల‌కు విరాళంగా ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

కాగా ఇంద్రాణియా భ‌ర్త పీట‌ర్ ముఖ‌ర్జియా మాత్రం త‌న అవ‌య‌వాల‌ను దానం చేయనని ప్రకటించాడు. కాగా, క‌న్న‌కూతురునే అత్యంత అమానుషంగా క‌డ‌తేర్చినట్టు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఆమె నిర్ణయంతో ఒక్కసారిగా ఆమెపై సానుభూతితో పరమ క్రూరత్వం పరిమళించిన వేళ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. కాగా, ఈ కేసు వ్యవహారం అంతా పుస్తక రూపంలో రాస్తానని ఇదివరకే ఇంద్రాణి ప్రకటించింది కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sheena Bora murderer  Indrani Mukherjea  donate property and Organs  

Other Articles