జిరాక్స్ మెషీన్.. గ్లిట్టర్ పెన్... 2000 నోటు మీ సొంతం | A Copier And Glitter Pen for fake notes.

Fake 2000 notes with simple method

Fake Currency, A Copier And Glitter Pen, Fake 2000 notes, Fake Currency mafia, Fake notes with simple method, fake 2000 notes Bengaluru, Bengaluru Fake Currency, Fake New Currency, How to find fake currency, Bengaluru men fake notes, Fake notes liquor shop

Bengaluru Men Used A Copier And Glitter Pen for making fake 2000 notes.

ఫేక్ 2000 నోటు ఎలా తయారు చేశారంటే...

Posted: 12/22/2016 09:50 AM IST
Fake 2000 notes with simple method

జస్ట్ సింపుల్ గా ఓ జిరాక్స్ మెషిన్, గ్లిట్టర్ పెన్ ఉంటే చాలూ.. బ్యాంకు, ఏటీఎం ల దగ్గర క్యూ కట్టాల్సిన అవసరం లేకుండా ఫేక్ కరెన్సీ కాళ్ల దగ్గరికి వచ్చేస్తోంది. బెంగళూరులో వెలుగుచూసిన నకిలీ నోట్ల స్కాంలో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ఆ నలుగురు ఫేక్ రెండు వేల నోటును ఎలా తయారు చేశారు? చెలామణి చేసేశారో ఇప్పుడు చూద్దాం.

కేవలం నాలుగంటే నాలుగు రోజుల్లోనే వీరు పాతిక నోట్లను మార్చేసుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఐటీఐలో డిప్లోమా చేసిన ఇద్దరు యువకులు, మరో ఇద్దరు స్నేహితుల సహకారంతో ఓ జిరాక్స్ మెషిన్ తెప్పించుకున్నారు. 2000 నోటుపై పూర్తిస్థాయి అవగాహన లేదన్న ఉద్దేశంతో వేరే పేపర్ ను వాడి నోటును కలర్ జిరాక్స్ తీసేశారు. ఆపై గ్లిట్టర్ పెన్ తో గ్రీన్ కలర్ కోటింగ్ ఇచ్చేసి దర్జాగా మార్చే యత్నం చేశారు.
నగరానికి చెందిన శశాంక్, మధు కుమార్ వాళ్ల ఫ్రెండ్ షాపులో రూ.2 వేల నోట్లను జిరాక్స్ తీయించారు. తర్వాత వాటిని ఆ నోటు సైజులో కట్ చేశారు. ఈ ఇద్దరికి కిరణ్ కుమార్, నాగరాజు జత కలిశారు. నకిలీవి గుర్తించటం ఎలాగంటే...

నాలుగు రోజుల పాటు సాగిన వారి నకిలీ వ్యవహారం ఓ వ్యాపారి కనిపెట్టడంతో బయటపడింది. పట్టుబడే వరకు 8 బ్రాందీ దుకాణాల్లో కావలసిన సరుకు కొనుక్కున్నారు. నిందితుల్లో ఇద్దరు మొబైల్ షాపులో పని చేసేవారు. ఒకరు మెకానిక్. మరొకరు ఆటో డ్రైవర్. ఆ మద్యం షాపుల నుంచి 8 నకిలీ నోట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీరు మరో 25 నోట్లు కూడా మార్చారని, వాటిని కూడా స్వాధీనం చేసుకుంటామని పోలీసులు చెప్పారు. పేపర్ మాత్రం తేడా ఉంటుంది.. మిగతా ఫీచర్స్ అన్ని అచ్చం ఒరిజినల్ నోటులాగే కనిపిస్తోందంటూ ఓ అధికారి తెలపటం విశేషం. మరోవైపు ఒడిశాలో కూడా ఇదే తరహాలో 4 లక్షల దాకా ఫేక్ కెరెన్సీ బయటపడిన విషయం తెలిసిందే. దీంతో వ్యాపారస్థులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు బ్యాంకులు సూచిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fake Currency Notes  Rupees 2000 notes  Bengaluru men fake notes  

Other Articles