దిల్‌సుఖ్‌నగర్‌ జంటపేలుళ్ల కేసులో ఆ ఐదుగురికి ఉరి Yasin Bhatkal, four other IM men sentenced to death

Dilsukhnagar blasts case yasin bhatkal four other im men sentenced to death

Dilsukhnagar blasts, special court, NIA, National Investigation Agency, Mohammed Riyaz, yasin baktal, Asadullah Akthar , Zia Ur Rahman, Mohammed Tahseen Akthar, Ajaz Shaikh

The National Investigation Agency (NIA) Special Court in Hyderabad sentenced five operatives of Indian Mujahideen (IM) to death in the Dilsukhnagar twin blasts case.

దిల్‌సుఖ్‌నగర్‌ జంటపేలుళ్ల కేసులో ఆ ఐదుగురికి ఉరి

Posted: 12/19/2016 05:54 PM IST
Dilsukhnagar blasts case yasin bhatkal four other im men sentenced to death

దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్ల కేసులో దోషులుగా నిర్థితమైన ఐదుగురకి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు  ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. జంట బాంబు పేలుళ్లలో ఈ ఐదుగురూ దోషులేనని నిర్ధారించిన న్యాయస్థానం ఇవాళ వారికి శిక్షలను ఖరారు చేసింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులుండగా ప్రధాన సూత్రధారి రియాజ్‌ భత్కల్‌ ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ఉగ్రవాద సంస్థ దేశంలో పాల్పడిన ఘాతుకాలకు సంబంధించి విచారణ పూర్తయి తీర్పు వెలువడిన తొలి కేసు ఇదే కావడం గమనార్హం.

కట్టుదిట్టమైన భద్రతల నడుమ చర్లపల్లి జైలు అవరణలోనే వున్న కోర్టు తీర్పును వెలువరించింది. పాకిస్తాన్‌లో తలదాచుకున్న రియాజ్‌ భత్కల్‌ ఆదేశాల మేరకు జరిగిన ఈ ఆపరేషన్‌లో అతడి సోదరుడు మహ్మద్‌ అహ్మద్‌ సిద్ధిబప్ప అలియాస్‌ యాసీస్‌ భత్కల్‌తో పాటు అసదుల్లా అక్తర్‌ అలియాస్‌ హడ్డీ, జియావుర్‌ రెహ్మాన్‌ అలియాస్‌ వకాస్‌ (పాకిస్తానీ), మహ్మద్‌ తెహసీన్‌ అక్తర్‌ అలియాస్‌ మోను, ఎజాజ్‌ షేక్‌ పాలుపంచుకున్నారని ఎన్‌ఐఏ తేల్చింది. విధ్వంసంలో యాసీన్‌ భత్కల్‌ నేరుగా పాల్గొననందున అతణ్ని ఐదో నిందితుడిగా చేర్చింది.

హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ పేలుళ్లను స్థానిక పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు బృందం అధికారులకు బదలాయించారు. ఈ రెండు కేసులకు కీలక ప్రాధాన్యమిచ్చిన ఎన్‌ఐఏ అధికారులు 157 మంది సాక్షులతో పాటు 502 డాక్యుమెంట్లు, 201 ఆధారాలను కోర్టు ముందుంచారు. నిందితులపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద. పేలుడు పదార్థాల చట్టం సెక్షన్ల కింద ఎన్‌ఐఏ అభియోగాలు మోపింది. ఆరుగురు ఉగ్రవాదుల్లో ఐదుగురు దోషులుగా తేలగా, పాకిస్థాన్‌లో ఉన్న రియాజ్‌ భత్కల్‌పై ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేసింది. ఈ జంట పేలుళ్లలో 18 మంది మరణించగా ఏకంగా 131 మంది క్షతగాత్రులవడం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles