బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త | RBI exceeds withdrawal soon.

Withdrawal limit to ease soon

Withdrawal limit, New Notes in India, Withdrawal limit ease, RBI Withdrawal limit, RBI New Notes, 50 percent new notes in Bank, new notes re-channelised, Withdrawal limit Exceed, ATM withdraw exceed, ATM withdrawal RBI

Withdrawal limit to ease after 80% new notes re-channelised.

కరెన్సీ కష్టాల నుంచి కాస్త ఊరట

Posted: 12/16/2016 07:53 AM IST
Withdrawal limit to ease soon

వెయ్యి నోట్లకు కేవలం ఆర్బీఐలోనే మార్పిడికి నిబంధనలు విధించిన ఆర్బీఐ ఇవాళ్లి నుంచి 500 నోట్లు కూడా చెల్లవని చెప్పేసింది. ఏటీఎంలలో 2000 నోటు మాత్రమే వస్తోంది. పరిమితి 2500 మాత్రమే. కొత్త ఐదొందల నోట్లు ఇంకా బయటికి రాలేదు. పోనీ బ్యాంకు నుంచి నేరుగా విత్ డ్రా చేసుకుందామంటే అక్కడా నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది?

వందల సంఖ్యల్లో క్యూలు, గంటల తరబడి ఎదురుచూపులు.. ప్రత్యక్ష నరకమే కదా! సమస్యకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుందో ఆర్థిక శాఖ, బ్యాంకు అధికారులకే తెలియనప్పుడు ఇక మనం ఏం చేయగలం! అయితే త్వరలో కాస్త దీనికి ఊరట కలిగించే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. నగదును విత్ డ్రా చేసుకోవడానికి ఉన్న పరిమితిని కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఎత్తివేయనున్నట్టు తెలుస్తోంది.

80 శాతం కొత్త కరెన్సీ బ్యాంకులకు వచ్చిన వెంటనే నిబంధనలను సడలిస్తారని సమాచారం. ఇప్పటికే బ్యాంకుల్లో 50 శాతం కొత్త కరెన్సీనే ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బ్యాంకు ఖాతాల్లో డబ్బు ఉన్నప్పటికీ... విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం లేక, జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొత్త కరెన్సీ భారీ ఎత్తున్న రిలీజ్ చేయబోతున్నారన్న బ్యాంకు వర్గాల సమాచారం నేపథ్యంలో విత్ డ్రా పరిమితిని సడలిస్తే... జనాలకు ఉపశమనం లభించినట్టే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RBI  New Notes  Withdrawal limit Exceed  

Other Articles