ఎన్నికలలో డోనాల్డ్ ట్రంప్ అవకతవకలపై క్లారిటీ.. Trump still winner after Wisconsin recount

Recount backs trump win in wisconsin as pennsylvania bid fails

Donald Trump, US president elect trump, Pennsylvania, Green Party candidate, Jill Stein, presidential elections, recounting results, Wisconsin

Election officials from the US state of Wisconsin have certified Donald Trump's victory in the state, as a judge in Pennsylvania stopped a push for a recount

ఎన్నికలలో డోనాల్డ్ ట్రంప్ అవకతవకలపై క్లారిటీ..

Posted: 12/14/2016 11:24 AM IST
Recount backs trump win in wisconsin as pennsylvania bid fails

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో (ప్రెసిడెంట్ ఎలక్ట్) విజేతగా నిలిచి త్వరలోనే శ్వేతసౌధం పగ్గాలను అందుకోనున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ నవంబర్ 8న వెల్లడైన ఫలితాలలో అవకతవకలు పాల్పడ్డారన్న అంశంమై క్లారిటీ వచ్చేసింది. ట్రంప్ కు మద్దతుగా రష్యాకు చెందిన హ్యాకర్లు ఎన్నికల ఈవీఎంలను హ్యాక్ చేశారని.. అక్కడ రీకౌంటింగ్ చేపడితే.. అయన బండారం బయటపడుతుందని అరోపించిన గ్రీన్ పార్టీ అభ్యర్థి రీ కౌంటింగ్ జరిపించాలని డిమాండ్ చేశారు.

దీంతో అమెరికా ఎన్నికలలో అత్యంత ప్రభావం కనబర్చిన విస్కాన్సిన్ పెన్సిల్వేనియాల్లో అక్కడి ఎన్నికల అధికారులు అమె డిమాండ్ కు సంబంధించి ఓట్ల రీకౌంటింగ్ కు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. అందకు అయ్యే ఖర్చులను కూడా గ్రీన్ పార్టీ భరించేందుకు సమ్మతించిన నేపథ్యంలో రీకౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే రీ కౌంటింగ్ తరువాత రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కు మరో 131 ఓట్లు అధికంగా రావడం.. అయనపై చేసిన అరోపణలన్నీ సత్యదూరమని క్లారిటీ వచ్చింది.

దీంతో విస్కాన్సిన్, పెన్సిల్వేనియాల్లో ట్రంప్‌ గెలిచినట్లు అధికారులు ధ్రువీకరించారు. దీంతో గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టీన్ కు తన పరాజయాన్ని అంగీకరించారు. ఇక రంగంలోకి దిగిన న్యాయస్థానాలు పెన్సిల్వేనియా, మిషిగన్‌లలో రీకౌంటింగ్ అవసరం లేదని తేల్చిచెప్పాయి. రీకౌంటింగ్‌ లోనూ డోనాల్ట్ ట్రంప్ హవా కోనసాగడంతో రిపబ్లికన్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles