సిటీ బస్సులో స్వైపింగ్ మిషిన్లు.. చిల్లర కష్టాలు ఎలా తీరుతాయి? | Hyderabad city buses PoS machines.

Switch to pos machines in hyderabad city buses

Hyderabad city buses, PoS machines in buses, Telangana Cashless state, Telangana RTC demonetization, demonetization Telangana Buses, Telangana Buses Cashless, AP Buses PoS machines

Telangana govt introducing PoS machines In Hyderabad City Buses as well as Main Bus stands.

ఊరట: సిటీ బస్సులో కూడా స్వైపింగ్ మిషన్లు!

Posted: 12/07/2016 08:25 AM IST
Switch to pos machines in hyderabad city buses

కరెన్సీ కష్టాలతో నిత్యావసర వస్తువులను కొనుగొలు చేసుకోవటమే కాదు, కనీసం రవాణాలు కూడా చేయలేని పరిస్థితికి సామాన్య ప్రజానీకం చేరుంది. బ్యాంకుల్లో సైతం కరెన్సీ లేకపోవటం, ఉన్న డబ్బును రాత్రికి రాత్రి ఏటీఎంలో నింపితే, ఉదయం కల్లా మాయం అయిపోవటం ఇలా కొత్త నోటు వాసన ఇంకా చూడని వారు చాలా మందే ఉన్నారు. ఇదిలా ఉంటే జనాల కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వాలు కొత్త ఆలోచనలకు తెరలేపుతున్నారు. ఇప్పటికే క్యాష్ లెస్ అంటూ రంగంలోకి దిగిన కొన్ని రాష్ట్రాలు పీవోఎస్ మిషన్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా రానున్న నాలుగు నెలల్లో 10లక్షల మిషిన్లను అందుబాటులోకి తేవాలంటూ బ్యాంకులను కోరింది.

ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికి తగ్గట్లుగానే ఆలోచనలు చేస్తుంది. త్వరంలో ఆర్టీసీ బస్సులో కూడా స్వైపింగ్‌ తరహా మిషన్ లను అందుబాటులోకి రానున్నాయి. అన్ని రకాల క్రెడిట్, డెబిట్‌ కార్డుల ద్వారా ప్రయాణికులకు రవాణా సదుపాయం కల్పించనుంది. ప్రధాన బస్టాండ్ లైన మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌స్టేషన్ల నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు నేరుగా కార్డుల ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

ఇక ఇంతేకాదు ఏకంగా సిటీ బస్సుల్లో కూడా స్వైపింగ్‌ ఆధారిత టిక్కెట్‌ ఇష్యూయింగ్‌ (టిమ్స్‌) మిషన్లను ప్రవేశపెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. ఈ నెల 15 నుంచి మొదటి విడత సేవలను ప్రారంభించి, ఆపై పూర్తి స్థాయిలో విస్తరించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని గ్రేటర్ ఈడీ పురుషోత్తమ్ మీడియాకు తెలిపాడు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌తో పాటు మరికొన్ని బ్యాంకులతోనూ ఇప్పటికే చర్చలు జరిపినట్లు కూడా ఆయన వివరించాడు.

కరెన్సీ రద్దు తర్వాత కేవలం బస్ పాస్ లపైనే సుమారు కోటిన్నర నష్టం వాటిల్లిందని, పాత నోట్లను పాస్ రెన్యువల్ కి తొలుత అంగీకరించకపోవటంతోనే ఇలా అయ్యిందని ఆయన తెలిపాడు. అందుకే సిటీ బస్సుల్లో కూడా ఈ నిర్ణయాన్ని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నాడు. సికింద్రాబాద్‌ రెతిఫైల్‌ బస్‌స్టేషన్, దిల్‌సుఖ్‌నగర్, కోఠీ, చార్మినార్, వీఎస్‌టీ, సనత్‌నగర్, హయత్‌నగర్, ఉప్పల్, తదితర ప్రాంతాల్లోని ప్రధాన కేంద్రాల్లో స్వైపింగ్‌ సేవలను అందుబాటులోకి తేబోతున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం దూర ప్రాంతాలకు వెళ్లేవారి కోసం ఈ ప్రయత్నం ప్రారంభించగా సత్ఫలితాలను ఇస్తోంది. మరి ఈ నిర్ణయం తెలంగాణకు ఏ మేర లాభిస్తుందో వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PoS machines  Telangana  City Buses  

Other Articles