స్త్రీ ధనంపై కంగారువద్దు.. బంగారంపై అందోళన వద్దు.. venkaiah naidu on gold gifted by parents to women

Venkaiah naidu on gold gifted by parents to women

hyderabad, women, gold, centre, venkaiah naidu, women gold ornaments, tax on gold ornaments, demonetisation, bjp up, aap, aam aadmi party, aap campaign, bjp, aap target bjp, up polls, india news

Union Minister Venkaiah Naidu responded on gold tax issue says gold gifted by parents to thier daughter is not taxable

స్త్రీ ధనంపై కంగారువద్దు.. బంగారంపై అందోళన వద్దు..

Posted: 12/03/2016 07:19 PM IST
Venkaiah naidu on gold gifted by parents to women

కేంద్ర ప్రభుత్వం బంగారంపై విధించిన పన్నుపై వస్తున్న వదంతులను నమ్మవద్దని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. తమ వద్ద ఉన్న బంగారం గురించి మహిళలు కంగారుపడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. వారసత్వ బంగారం గురించిన లెక్కలను కేంద్రం అడగబోదని వెంకయ్యనాయుడు అన్నారు. అయితే, పెద్ద నోట్ల రద్దు తర్వాత కొన్న బంగారానికి మాత్రం లెక్క చెప్పక తప్పదని ఆయన తేల్చి చెప్పారు.

ఐటీ దాడుల్లో బంగారం పట్టుబడితే ప్రతి గ్రాముకు లెక్క చూపించవలసి ఉంటుంది. వివాహిత వద్ద 500 గ్రాముల బంగారం, అవివాహితుల వద్ద 250 గ్రాముల వరకు బంగారం ఉండవచ్చు. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల వివరాలు వెల్లడించింది. పురుషుల వద్ద వంద గ్రాముల బంగారం ఉండవచ్చు. ఇప్పటికే వెల్లడించిన డబ్బుతో బంగారం కొంటే పన్ను లేదు. వారసత్వంగా వచ్చిన బంగారం పైన కూడా పన్ను లేదు. పన్ను మినహాయింపు ఉన్న సొమ్ముతో బంగారం కొనుక్కోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles